Agripedia

ఉద్యాన తోటల్లో అధికమవుతున్న చీడపీడల సమస్య, నివారణ చర్యలు...!

KJ Staff
KJ Staff

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ రాష్ట్రాన్ని ఉద్యాన తోటల హబ్ గా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని రకాల పంటలు, పూత, పిందె, కాయ దశల్లో ఉన్నాయి. అయితే జూన్, జూలైలో కురిసిన వర్షాల కారణంగా అరటి, దానిమ్మ టమోటా వంటి ఉద్యానతోటల్లో చీడపీడల సమస్య అధికం అవుతోంది. వీటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను ఉద్యాన అధికారులు సూచించడం జరిగింది.

దానిమ్మ : ప్రస్తుతం దానిమ్మలో ఆండ్రక్నోస్ లేదా ఫోమోప్సిస్ తెగులు సోకే అవకాశాలు ఉన్నందున రైతులు ఈ వ్యాధి నివారణకు1 గ్రాము థయాప్సినేట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 శాతం. బోర్డో మిశ్రమం లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. వ్యాధి సాకిన కాయలును తోట నుంచి తొలగించి కాల్చివేయాలి.

అరటి : గాలిలో తేమశాతం పెరగడం వల్ల అరటిలో ఎక్కువగా వచ్చే సిగలోక ఆకుమచ్చ తెగులు దెబ్బ తీస్తోంది.ఆకులు పసుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడిన లక్షణాలు కనిపిస్తే ఆకులను కోసి నాశనం చేయాలి. వ్యాధి నివారణకు1.మి.లీ ఆజాక్సీ బీన్ లేదా 1.4 గ్రాములు ట్రైప్లాక్సిస్టోజీన్ లేదా 1మి.లీ సిప్రొనిల్ లీటర్ నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.

టమాట: ప్రస్తుతం టమోటా నారుమడి నుంచి పంట కోత వరకు వివిధ దశలో ఉంది. జూన్, జూలై నెలలో పడిన వర్షాల కారణంగా గాలిలో తేమశాతం ఎక్కువై ఆకుమచ్చ తెగులు, కొమ్మతెగులు, ఎండుతెగులు వ్యాపించాయి. వీటి నివారణకు 1 గ్రాము థయాప్సినేట్ మిథైల్ 25 గ్రాములు ఎం-45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 10 రోజుల తర్వాత 1 గ్రాము ప్రాపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక పిన్విర్క్ అనే పురుగు లర్వా దశలో కాయను తొలిచి దెబ్బతీస్తుంది. నివారణకు 1 మి.లీ 1000 సీపీ ఎం వేపనూనె + 1 గ్రాము ఇండాక్సికార్స్ బీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు ఐదు చొప్పున ఫిరమోన్ ఎరలు ఏర్పాటు చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine