Agripedia

భారత దేశం లో చిరు ధాన్యాల సాగు ...

Srikanth B
Srikanth B

 

భారతీయ జనాభాలో అధిక భాగం (70%) వ్యవసాయంపై ఆధారపడి ఉంది,ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థకు మరియు దేశానికి ఆహార భద్రతను సమకూర్చడంలో దోహదం చేస్తుంది . మొత్తం స్థూల జాతీయోత్పత్తి (GDP)లో దాదాపు ఐదవ వంతు వాటాను వ్యవసాయ మరియు వ్యవసాయ సంబంధిత రంగాలు కల్గి ఉన్నాయి . ఈ ప్రాథమిక రంగం పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారాన్ని సమకూర్చడం లో మరియు గ్రామీణ జీవనానికి ఉపాధిని అందించడం లో కీలక పాత్ర పోషిస్తుంది .

భారతదేశంలో తృణ ధాన్యాలు జొన్నలు ,సజ్జలు ,కొఱ్ఱలు ,వరిగెలు ,రాగులు ఇతర తక్కువ ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యాలు:
కులై,కుసుములు,అరికెలు , కొర్రలు,సామలు,ఉదలు వంటి తృణ ధాన్యాలను సాగు 17 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 18.66 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితో మరియు వివిధ సీజన్లలో పండిస్తారు.


భారతదేశంలోని నీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతంలో తృణ ధాన్యాల సాగు అధికముగా జరుగుతుంది , అతి తక్కువ వర్ష పాతం తో సాగు చేయబడే ఈ పంటలు ,చౌకైన అధిక పోషకాలను కల్గి ఉన్నాయి . జీర్ణక్రియ ఫైబర్స్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలను కల్గి ఉన్నాయి . వీటిలో జొన్నలు అధికముగా ప్రొటీన్, ఐరన్ మరియు జింక్ వంటి పోషకాలను అందించడం లో 35% వాటాను కల్గి ఉన్నాయి . ధాన్యాలలో అధిక పోషక విలువలు ఉన్నందున వాటిని పోషక-తృణధాన్యాలుగా సూచిస్తారు, ముఖ్యంగా Ca, Fe మరియు Zn సూక్ష్మపోషకాల ప్రధాన మూలం ఈ తృణ ధాన్యాలు , తక్కువ ఆదాయం కల్గిన కుటుంబలకు పోషకాహార కొరత తీర్చడంలో దోహదపడుతున్నాయి . దేశంలోని తక్కువ మరియు సగటు వర్షపాతం ఉన్న ప్రాంతాలలో వీటిని సాగు చేయడం ఉత్తమం .

జొన్నలు మరియు ఇతర చిరు ధాన్యాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, AP, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్ మరియు హర్యానా వంటి ప్రధాన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల వ్యవసాయ GDPలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో 90% వాటా ను జొన్న మరియు సజ్జలు కల్గి ఉన్నాయి .

2023, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది -ప్రధాని

జొన్న సుమారు 6 మిలియన్ హెక్టార్లలో పండే ఈ చిరుధాన్యం భారతదేశంలో దాదాపు 6 మిలియన్ టన్నుల ఉత్పత్తిని కలిగి ఉంది, ధాన్యాల సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తి పరంగా మూడవ స్థానాన్ని కోల్పోయి ఐదవ స్థానానికి చేరుకుంది. రాష్ట్ర వారీగా, దేశంలోని మొత్తం జొన్న విస్తీర్ణంలో మహారాష్ట్ర 54% , తర్వాత కర్ణాటక (18%). సజ్జల సాగులో 60% విస్తీర్ణం తో దేశం లోనే రాజస్థాన్‌ మొదటి స్థానంలో నిలువగా ఆ తర్వాత మహారాష్ట్ర (10%) మరియు ఉత్తరప్రదేశ్ (9%) వాటాను కల్గి ఉన్నాయి. రాగి సాగులో కర్నాటక 60% విస్తీర్ణం తోమొదటి స్థానంలో ఉండగా మధ్యప్రదేశ్ దేశంలోని అవిసెలు సాగులో(34%) వాటాను కల్గి ఉంది .


ఏది ఏమైనప్పటికీ, జొన్నతో సహా మిల్లెట్‌లు అధిక ఉష్ణోగ్రత మరియు కరువును తట్టుకోగల సామర్థ్యం కారణంగా ప్రత్యామ్నాయ ఆహారం, మేత మరియు పశుగ్రాసం పంటగా అభివృద్ధి చెందుతున్నాయి. జొన్న యొక్క మార్కెట్ చేయబడిన మిగులు నిష్పత్తి (MSR) 1950-51లో కేవలం 24 నుండి 2012-13లో 64.14కి గణనీయంగా పెరిగింది, ఇది జొన్న రైతులు వినియోగ అవసరాలను తీర్చిన తర్వాత వారి ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారని సూచిస్తుంది. అదేవిధంగా, బజ్రా యొక్క MSR కూడా సంవత్సరాలుగా పెరిగింది. 2000వ దశకం ప్రారంభంలో (ASG, 2014) పోల్చితే ఫింగర్ మిల్లెట్ (రాగి) మార్కెట్ చేయబడిన మిగులు నిష్పత్తి దాదాపు సగం అయింది.

అందువల్ల, నీటి యొక్క ఎద్దడి కల్గిన ప్రాంతాలలో రైతులకు ప్రత్యామ్న్యాయంగా తృణ ధాన్యాల సాగు జరుగుతుంది . తక్కువ వర్షపాతం కల్గి న ప్రాంతాలలో రైతులకు జీవనోపాధి కోసం సాగు చేయబడే ఉత్తమమైన పంటలుగా తృణ ధాన్యాలు నిలిచాయి . అంతర పంటలు గ చిరు ధాన్యాలను సాగు చేయడం రైతులకు రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుతాయి . చిరు ధాన్యాల సాగులో (i) ఉత్పాదకతను పెంచడం ద్వారా, (ii) సాగు వ్యయాన్ని తగ్గించడం ద్వారా, (iii) మార్కెట్ అవకాశాలను పెంచడం ద్వారా మరియు (iv) స్థిరమైన విలువ గొలుసును అభివృద్ధి చేయడం ద్వార వీటి యొక్క సాగును లాభదాయకంగా మార్చవచ్చు .

2023, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది -ప్రధాని

అంచనా వేయబడిన వాతావరణ మార్పులు ప్రకారం రబి ,ఖరీఫ్ సీజన్ గత సంవత్సరం కంటే ఈసారి ప్రతి నెల నెలకు వ్యత్యాసం ఉందని ఖరీఫ్ మొదటి-సగంలో వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది; జూన్ మరియు జూలై వర్షపాతం వరి మరియు సోయాబీన్‌లకు కీలకం, ఎందుకంటే అవి ఏపుగా ఉండే దశలో ఉంటాయి; నీటి నిర్వహణ కీలకం. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే రబీలో కనిష్ట ఉష్ణోగ్రత 2.5°C పెరుగుతుందని అంచనా వేయబడింది. రబీ ఉష్ణోగ్రతల అంచనా పెరుగుదల గోధుమలు మరియు చిరుధాన్యాల పంటలపై ప్రభావం చూపనుంది .

వ్యవసాయం, పరిశ్రమలు మరియు జీవనోపాధిపై వాతావరణ మార్పు యొక్క మొత్తం ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేయబడింది, ఇది ఆహార భద్రతకు మాత్రమే కాకుండా స్థిరత్వానికి కూడా ముప్పు కలిగిస్తుంది. మారనున్న వాతావరణ కారణాల దృష్ఠ్య సాంకేతికతతో కూడిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది .

2023, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది -ప్రధాని

Share your comments

Subscribe Magazine