Agripedia

"అన్ని అగ్రికల్చర్ కోర్సులలో .. సహజ వ్యవసాయం పాఠాలు "-నరేంద్ర సింగ్ తోమర్

Srikanth B
Srikanth B

వ్యవసాయ విద్య పాఠ్యాంశాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రభుత్వం చేర్చనుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు . మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన సెమినార్ లో మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన చేసారు .

తక్కువ ఖర్చులతో అధిక దిగుబడి అందించే సహజ వ్యవసాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై వ్యవసాయ విద్యలో సహజ వ్యవసాయం కూడా భాగమవుతుందని తెలిపారు. త్వరలో వ్యవసాయ విద్య పాఠ్యాంశాల్లో సహజ వ్యవసాయ పద్ధతులను చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. భారతదేశ జనాభాకు సంబంధించి ఆహార ధాన్యాలు కొరతగా ఉన్న సమయాన్ని తోమర్ గుర్తు చేసుకున్నారు.


ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు, దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా ఎరువులు వాడుతున్నట్లు తెలిపారు. నేడు మనం మిగులుతో ఆహారధాన్యాలను పండిస్తున్నాం' అని ఆయన చెప్పారు. ఆరోగ్యవంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన వ్యవసాయం, ఆరోగ్యవంతమైన మనిషి అనే సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సహజ వ్యవసాయం వైపు వెళ్లాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం పరిపూర్ణ వ్యవసాయం అని ఆయన అన్నారు .

Perennial Rice23 :ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

ఒక సాధారణ రైతు సహజ వ్యవసాయం చేయడానికి స్థానిక ఆవు పేడ మరియు ఆవు మూత్రం సరిపోతుందని, దేశం సహజ వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తే , రైతులకు ఆర్థిక ఖర్చులు తగ్గి లాభదాయకమైన వ్యవసాయం చేయవచ్చని గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో 100 శాతం సహజ వ్యవసాయం జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. హిమాచల్‌లోని రైతులు కూడా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 5000 గ్రామాల్లో ఈ పథకం రూపొందించబడింది. దేశంలో వ్యవసాయానికి ముఖ్యమైన స్థానం ఉందని, రసాయనిక వ్యవసాయం వల్ల భూసారం తగ్గి పోతుందని అది రానున్న కాలం లో దిగుబడి పై గణనీయముగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు .

Perennial Rice23 :ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

Related Topics

narendra singh thomar

Share your comments

Subscribe Magazine