Agripedia

వర్మీకంపోస్టు తయారీ విధానం మరియు లాభాలను తెలుసుకోండి.

S Vinay
S Vinay

వానపాములను మరియు సేంద్రీయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో ఎరువుని తయారు తయారు చేస్తారు దీనినే
వర్మీకంపోస్టు అంటారు. సాధారణంగా వానపాములు మట్టిలో నివసిస్తాయి. వానపాములు సేంద్రీయ వ్యర్థ పదార్థాలను తింటాయి తర్వాత నత్రజని ,భాస్వరం,పొటాషియం మెగ్నీషియం మరియు కాల్షియం వంటి పోషకాలను విసర్జిస్తాయి. ఈ విసర్జిత పదార్థమే ఎరువుగా ఉపయోగపడుతుంది.దీనిలో మొక్కలకి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.నేల యొక్క భూసార సామర్థ్యం కూడా సహజంగా పెరుగుతుంది. వర్మీకంపోస్టు తయారీ విధానం తెలుసుకుందాం.

వర్మీకంపోస్ట్ తయారీకి కావాల్సినవి.
వానపాములు
పంట మిగులు అవశేషాలు
కూరగాయల వ్యర్థాలు
ఆవుపేడ
పాలిథిన్ లేదా గొనె సంచులు.

తయారీ విధానం:
ముందుగా మూడు లేదా నాలుగు అడుగుల లోతులో గుంతలను ఏర్పరుచుకోవాలి. వాటి అడుగు భాగం ధృడంగా ఉండేందుకు సిమెంట్ కాంక్రీట్ ను వాడొచ్చు. తర్వాత పంట మిగులు అవశేషాలు ఆకులు ,గడ్డి, కూరగాయల వ్యర్థాలు మరియు ఆవుపేడను రెండు భాగాలుగా చేసుకోవాలి. మొదటగా గుంతలో వ్యవసాయ వ్యర్థాలను వేసి వాటి పైన ఆవుపేడను వేసుకోవాలి. తర్వాత మళ్ళీ వ్యవసాయ వ్యర్థాలను వేసి వాటి పైన ఆవుపేడను వేయాలి. ఇలా రెండు పొరలుగా ఒక క్రమబద్దీకరణలో గుంతలో వీటిని నింపాలి. రెండు వా రాల వరకు వీటికి క్రమ తప్పకుండ నీటిని అందిస్తూ ఉండాలి. అవి బాగా కుళ్ళిన తర్వాత వాటిలోకి వానపాములని వదలాలి. అవి ఆహారం కోసం కుళ్ళిన పదార్థాలను తింటాయి. వీటి విసర్జిత పదార్థమే వెర్మికంపోస్టు ఎరువు. అయితే ఈ వానపాములను పక్షుల నుండి రక్షించడానికి గుంతల పైన గోనె సంచులతో కానీ పాలిథీన్ సంచులతో కానీ కప్పి ఉంచాలి.

సహజ వనరులతో తయారు చేసుకున్న ఈ వెర్మికంపోస్టు పంటలకు కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా భూసారాన్ని పెంచుతుంది. నేల ఉత్పాదకత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రైతులు ఎరువుల ఖర్చును ని కూడా కొంత వరకు తగ్గించవచ్చు.

 

మరిన్ని చదవండి

పంట వ్యర్థాలను దహించకుండా ఫలవంతగా వాడుకుందాం ఇలా

Share your comments

Subscribe Magazine