Agripedia

పంట పొలాల్లో ఎలుకల ఉదృతిని ఆరికట్టండి ఇలా ..!

Srikanth B
Srikanth B

పాడి పంటలలో నష్టాన్ని కల్గించే వాటిలలో చీడ -పీడలు ఒకెత్తు అయితే ఇతర జీవాలు కల్గించే నష్టం మరో ఎత్తు ఉదాహరణకు ఎలుకలు , పందులు , ఇతర ముగా జీవాలు ఇందులో ప్రధానంగా ఎలుకలు రైతులకు తీవ్ర మైన నష్టాన్ని కలుగజేస్తాయి , ఇవి తీసుకునే ఆహారం కన్న పంటలకు కల్గించే నష్టం ఎక్కువ , పంటలను కత్తిరించేయడం వాళ్ళ ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు .

అయితే పంట పొలాల్లో ఎలుకల ఉదృతిని నిర్ములించడానికి . ఆంధ్ర ప్రదేశం వ్యవసాయ శాఖ అందించే కీలక మైన సూచనలను పాటిస్తూ పంట పొలాల్లో ఎలుకల ఉదృతిని ఆరికట్టవచ్చు .


ఎలుకల యాజమాన్యం :
ఎలుకల నివారణ కార్యక్రమము అమలు జరుపుటకు ముందు ప్రాధమిక ఎలుకల సర్వే నిర్వహింపబడును. ఈ సర్వేలో ఎలుకల కన్నాలు ఉన్నవో లెక్కించెదరు.

కృష్ణ, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో హెక్టారుకు సగటున 50 ఎలుకల కన్నాలు ఉన్నట్లు సర్వేలో తేలినది.

జిల్లాలో ప్రతీ గ్రామంలో నిర్ణించిన తేదీన రైతులందరూ బ్రోమోడయోలోన్ 0.25 శాతం సి.బి. ఎలుకల మందు వరి నూకలు మరియు వంతనునేతో కలిపిన ఎరను కాగితపు పొట్లము కట్టి తమ పొలంలో గుర్తించిన ఎలుకల కన్నంలో పెట్టాలి .

ప్రతి గ్రామంలో కేవలం పంట పొలంలోనే కాకుండా, రోడ్ల ప్రక్కన, కాలువల ప్రక్కన, పోరంబోకు నెలలో ఎలుక కన్నలో బ్రోమోడయోలోన్ 0.25 శాతం సి.బి. తో కూడిన ఎరను పెట్టాలి .

రూ.2.70 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్..

ఎలుకల కన్నలలో మందు పెట్టు విధానము.

మొదటి రోజు :-
ఎలుకల కన్నలను గుర్తించి మట్టితో మూసి వేయడం.

రెండవ రోజు :-
తెరిచి ఉన్నటు వంటి ఎలుకల కన్నలలో బ్రోమోడయోలోన్ మందు, వరి నూక మరియు వంట నునే కలిపిన ఎరను కన్ననికి 10 గ్రా చొప్పున పెట్టవలెను.

ఏడవ రోజు :-
తెరిచి ఉన్నటువంటి ఎలుక కన్నలలో మరల బ్రోమోడయోలోన్ మందుతో కూడినటువంటి ఎరను కన్నానికి 10గ్రా చొప్పున పెట్టవలెను.

15వ రోజు :-
తెరిచి ఉన్నటువంటి ఎలుక కన్నాలను లెక్కించి ఎలుకల నిర్మూలన శాతం లెక్కించుట.

రూ.2.70 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్..

Related Topics

Growing paddy

Share your comments

Subscribe Magazine