Agripedia

15 నుంచి కందుల కొనుగోలు సెంటర్లు ...రూ . 6600 కనీస మద్దతు ధర

Srikanth B
Srikanth B
Red Gram procurement centers starting from January 15
Red Gram procurement centers starting from January 15

రాష్ట్రము లో పప్పుధాన్యాలలో అధికముగా సాగు అయ్యే ధాన్యం కంది పప్పు అత్యధికముగా సంగారెడ్డి జిల్లాలో వానాకాలం లో జిల్లాలో 90,658 ఎకరాలలో కంది పంట సాగైందని తెలంగాణాన వ్యవసాయ శాఖ ప్రకటన విడుదల చేసింది అయితే పంట సజావుగా కోతలు జరిగితే వచ్చే జిల్లా వ్యాప్తముగా 54,394 మెట్రిక్ టన్నులు దిగుబడి వరకు వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయ అధికారాలు అంచనాలు వేస్తున్నారు .

దీనికి అనుగుణముగా జిల్లా వ్యాప్తముగా మార్కెట్లో రైతులకు సమస్యలు ఎదుర్కోకుండా 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంగారె అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు .

నిన్న శనివారం అధికారులతో ఈమేరకు సమీక్షా సమావేశం నిర్వహించి కొనుగోలుకు సంబంధించి అని చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు .
ప్రభుత్వం కందులు క్వింటాలు రూ.6,600 మద్దతు ధర ప్రకటించిందని చెప్పారు. కేంద్రా మాట్లాడుతున్న సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ లలో టార్పాలిన్లు. డిజిటల్ కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని మార్కె టింగ్ అధికారికి సూచించారు. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేసి రవాణా ఏర్పాట్లు చేయాలని, గోడౌన్లను గుర్తించాలన్నారు. సమా వేశంలో మార్క్ ఫెడ్ అధికారి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్, స్టేట్ వేర్ హౌసింగ్ కా ర్పొరేషన్ మేనేజర్ బజార్, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు.

యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...

గత సంవత్సరం కందుల MSP కనీస మద్దతు ధర 6300 ఉండగా ఏ సంవత్సరానికి 300 కనీస మద్దతు ధర పెంచింది . దీనితో పెరిగిన ధర తో రూ . 6600 కందులకు కనీస మద్దతు ధర రైతులకు లభించనుంది .

 ఈ ఏడాది ఏకంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్కు కేవలం నాలుగు క్వింటాళ్ల దేశీ రకం మిరపకాయలు(పొడి)-దేశి వరంగల్ రకం 4 క్వింటాలు రాగ క్వింటాల్ కు గరిష్టముగా 80,100 చొప్పున రికార్డు ధర పలికింది . 

యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...

Related Topics

MSP redgram

Share your comments

Subscribe Magazine