Agripedia

పంట వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రాల మంత్రులతో సమీక్షా సమావేశం!

Srikanth B
Srikanth B
పంట వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రాల మంత్రులతో  సమీక్షా సమావేశం!
పంట వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రాల మంత్రులతో సమీక్షా సమావేశం!

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పర్యావరణ,అడవులు,వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రో భూపేంద్ర యాదవ్, అధ్యక్షతన పంట వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రాలతో కేంద్ర మంత్రుల స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా సమావేశానికి సహ అధ్యక్షత వహించారు.

పంట వ్యర్థాలను తగలబెడుతున్న అంశంపై రాష్ట్రాలతో ముగ్గురు కేంద్ర మంత్రులు విస్తృతంగా చర్చించారు. ప్రభావిత జిల్లాల్లో సంబంధిత కలెక్టర్లకు రాష్ట్రాలు బాధ్యత అప్పగించాలని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తోమర్ సూచించారు. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా చూసేందుకు రాష్ట్రాలు తక్షణం పటిష్ట చర్యలు అమలు చేయాలని పర్యావరణ శాఖ మంత్రి శ్రీ యాదవ్ అన్నారు. పంటలు తగలబెట్టడం వల్ల ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో పటిష్ట చర్యలు అమలు చేయాలని శ్రీ రూపాలా అన్నారు.

ఉన్నత స్థాయి సమావేశానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు, మూడు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, దేశ రాజధాని మరియు పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత పరిరక్షణ కోసం ఏర్పాటైన కమిషన్ , విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాల సీనియర్ అధికారులు హాజరయ్యారు.


పంట వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్రం సరఫరా చేసిన యంత్రాలను సక్రమంగా వినియోగించి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో 47,000 యంత్రాలు, 601.53 కోట్ల రూపాయలు అందించిన కేంద్రం గత నాలుగు సంవత్సరాల కాలంలో 2.07 యంత్రాలను రాష్ట్రాలకు అందించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఎదురవుతున్న కాలుష్య సమస్య పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సహాయం అందిస్తోంది.

మరియు ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 601.53 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. అలాగే గత నాలుగేళ్ల కాలంలో విడుదల అయిన మొత్తంలో దాదాపు రూ.900 కోట్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయి. వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సమావేశం సూచనలు జారీ చేసింది.

వ్యర్థాలు పంట పొలంలో భూమిలో కలిసి పోయేలా చూసేందుకు పూసా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బయో-డీకంపోజర్‌ను రాష్ట్రాలు విస్తృతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని శ్రీ తోమర్ అన్నారు. రాష్ట్రాలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కార్యక్రమాలు అమలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని శ్రీ తోమర్ అన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ మరియు తార్న్ తరణ్ జిల్లాల్లో వ్యర్ధాల దహనం అరికట్టేందుకు సమర్ధ చర్యలు అమలు జరిగితే సగం సమస్య పరిష్కారం అవుతుందని శ్రీ తోమర్ వ్యాఖ్యానించారు. ఈ రెండు జిల్లాల నుంచి అత్యధికంగా సమస్య ఎదురవుతున్నదని ఆయన వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్దంగా ఛాయలు అమలు జరిగితే పశువులకు దాణా కూడా ఎక్కువగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. సమస్య పరిష్కారానికి అమలు చేయాల్సిన చర్యలు చర్చించేందుకు నవంబర్ 4న ఢిల్లీలోని పూసాలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు శ్రీ తోమర్ తెలిపారు.


పూసా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బయో-డీకంపోజర్‌ పై నెలకొన్న సందేహాలను వర్క్‌షాప్ లో నిపుణులు నివృత్తి చేస్తారని అన్నారు. సమావేశానికి హాజరు కావాలని పంజాబ్, పంజాబ్ పరిసర ప్రాంతాల రైతులు, పంజాబ్ ప్రభుత్వ అధికారులు వర్క్‌షాప్ లో పాల్గోవాలని ఆయన కోరారు. పంట వ్యర్థాల నిర్వహణకు పూసా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బయో-డీకంపోజర్‌ తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం అందిస్తుందని అన్నారు. పూసా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బయో-డీకంపోజర్‌ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీ తోమర్ అన్నారు.

పంట వ్యర్థాల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యంత్రాలు అందించిందని పర్యావరణ శాఖ మంత్రి శ్రీ యాదవ్ తెలిపారు. సమర్ధంగా వినియోగిస్తే సమస్య పరిష్కారానికి ఈ యంత్రాలు సరిపోతాయని అన్నారు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్న ఇతర కారకాలను కూడా కేంద్రం గుర్తించిందని అన్నారు. రాష్ట్రాలలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను దగ్ధం చేయడాన్ని నివారించాలని ఆయన స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి, పూసా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బయో-డీకంపోజర్‌ వినియోగం ఎక్కువ చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రధాన కార్యదర్శికి మంత్రి సూచనలు జారీ చేశారు.

రైతులకు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్న 600 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు

కొంతమంది రైతులను ఎంపిక చేసి ఐఈసి కార్యక్రమాలు అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. సమస్య పరిష్కారం కోసం అవసరమైన నిధులు సమకూర్చుకుని పటిష్ట వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. బయో డీకంపోజర్ వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించేందుకు పొలాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రంలో 8.15 లక్షల హెక్టార్లకు పైగా భూమిని ఈ టెక్నాలజీ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బయోమాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు , బయో ఇథనాల్ కేంద్రాలు తమ సమీప ప్రాంతాల్లో లభిస్తున్న పంట వ్యర్థాలను ఉపయోగించుకునేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. సంబంధిత వర్గాల్లో అవగాహన చైతన్యం కలిగించేందుకు కిసాన్ మేళాలు, ప్రచురణలు, సెమినార్‌లు, చర్చలు నిర్వహించాలని కూడా సమావేశం నిర్ణయించింది. . రైతుల భాగస్వామ్యంతో రైతులకు అవగాహన కల్పించేందుకు ఐఈసి కార్యకలాపాలను అమలు చేసి పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని సమర్థవంతంగా నివారించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

రైతులకు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్న 600 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు

Share your comments

Subscribe Magazine