Agripedia

పెరిగిన వేరుశెనగ ధర క్వింటాకు రూ.7,370..

Srikanth B
Srikanth B

తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ పంటకు పత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ వేరుశెనగ ఉత్పత్తిలో భారతదేశంలో 4వ స్థానంలో ఉంది. వేరుశెనగ పంటను అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణ మొదలగు జిల్లాలో అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతకాలంలో ఈ వేరుశెనగ పంటను చీడపురుగుల బెడద ఎక్కువై పంటకు నష్టం వాటిల్లుతుంది. దీనితో ఈ వేరుశెనగ సాగు చేసే రైతులకు లాభాలు తగ్గిపోయాయి.

వారం రోజులుగా వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కుదేలైన వేరుశనగ ధరలు కాస్త మెరుగుపడ్డాయి.ఒక్క రోజు వ్యవధిలో క్వింటాపై రూ.240 అధికంగా పలకడం గమనార్హం. శనివారం యార్డుకు 1,859 బస్తాల వేరుశనగ వచ్చింది. వీటిలో మేలిమి రకానికి చెందిన వాటికి క్వింటా గరిష్ఠ ధర రూ.7,370 పలికింది. కనిష్ఠ ధర రూ.5,499, మాదిరి రకానికి రూ.6,362 పలికినట్లు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి లక్ష్మయ్యగౌడ్‌ తెలిపారు.

తెలంగాణాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు .. ఏప్రిల్ 2 వ వారం నుంచి కొనుగోళ్లు !

వేరుశెనగ ఉత్తమ రకాలు :

ఈ తెగుళ్ల సమస్యకు సంబంధించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రైతులకు శుభవార్త తెలియాజేసింది. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, వేరుశెనగలో కొత్త రకం వంగడాన్ని తయారుచేసింది. ఈ వంగడం పేరు వచ్చేసి టీసీజీఎస్– 1694 (విశిష్ట). ఈ విశిష్ట వంగడాన్ని రైతులు సాగు చేయడం ద్వారా వారికి ఈ ఆకుపచ్చ తెగులు సమస్యను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విశిష్ట వంగడంతో సాధారణ రకం కంటే 15 శాతం అధన దిగుబడి కూడా వస్తుంది.

తెలంగాణాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు .. ఏప్రిల్ 2 వ వారం నుంచి కొనుగోళ్లు !

Related Topics

ground nuts

Share your comments

Subscribe Magazine