Education

నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా..

Gokavarapu siva
Gokavarapu siva

హైదరాబాద్ నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే హైదెరాబద్లో త్వరలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా అనేది నిరుద్యోగులకు పెద్ద వరం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి అర్హులైన వారందరు మీ యొక్క సర్టిఫికెట్లను సిద్ధం చేసుకుని ఉండండి.

హైదరాబాద్ లో ఈ మెగా జాబ్ మేళా అనేది వచ్చేనెల అనగా ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారుగా 100 కంపెనీలు పైగా పాల్గొంటున్నట్లు చెబుతున్నారు. ఈ కంపెనీల్లో దాదాపుగా 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఈ ఉద్యోగాలకు అర్హత వచ్చేసి, అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా వీటితోపాటు హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ చదివినవారు కూడా అర్హులే. మీ విద్యార్హత చూసుకుని వెంటనే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోండి.

ఇది కూడా చదవండి..

ఆధార్ తీసుకుని 10 ఏళ్లయిందా? ఐతే తప్పనిసరిగా మీ వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ చేయండి..

ఇంటర్వ్యూ హాజరు కావడానికి అభ్యర్థులు తమ వెంట కొన్ని ధ్రువపత్రాలను తీసుకునివెళ్ళాలి. ఆ ధ్రువపత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, గతంలో ఏదైనా కంపెనీలో పనిచేసినట్లైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, క్రీడాకారులైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్లను అభ్యర్థులు తీసుకుని వెళ్ళాలి. పైన చెప్పిన అన్ని ధ్రువపత్రాలను 3 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్ళాలి.

అభ్యర్ధులందరికి ఏప్రిల్ 2వ తేదీన ఇంటర్వ్యూ జరగనుంది. ఈ ఇంటర్వ్యూలు అనేవి ఏప్రిల్ 2న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులకు ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లిలో జరుగుతాయి. ఈ మెగా జాబ్ మేళా గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించమని ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి..

ఆధార్ తీసుకుని 10 ఏళ్లయిందా? ఐతే తప్పనిసరిగా మీ వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ చేయండి..

Related Topics

job mela hyderabad

Share your comments

Subscribe Magazine