Education

నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్.. నెలకు 3 వేల ఉపకారవేతనం !

Srikanth B
Srikanth B
National Talent Scholarship
National Talent Scholarship

భారతదేశంలో వైద్యం , ఇంజనీరింగ్ తరువాత అత్యంత ప్రాధాన్యత కల్గిన కోర్స్ ఏదైనా వుందా అంటే అది ముమ్మాటికీ అగ్రి కల్చర్ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సు లు మాత్రమే అదేక్రమంలో భారతదేశంలో వ్యవసాయ విద్యను బలోపేతం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ,ఐసీఏఆర్ గుర్తింపు పొందిన అగ్రికల్చర్ కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2000, పీజీ విద్యార్థులకు నెలకు రూ.3000 వారి ప్రతిభను బట్టి ఉపకారవేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది .

 

ప్రతి సంవత్సరం నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్ (ఎన్‌టీఎస్) పేరిట ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.


ఎవరు అర్హులు :

ఐసీఏఆర్ గుర్తింపు పొందిన అగ్రికల్చర్ కళాశాలల్లో అనగా ఐసీఏఆర్ గుర్తింపు పొందిన కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరూ దీనికి అర్హులు .

ప్రైవేటు వ్యవసాయ కళాశాలలో చదివే విద్యార్థులు దీనికి అర్హులు కారు .

ఏ రాష్ట్రము లో చదువుతున్నారనేది సంబంధం లేకుండా విద్యార్థులు దీనికి దరకాస్తు చేసుకోవచ్చు .

Bsc చదివే విద్యారులకు రూ . 2000 వేలు , MSc చదివే విద్యార్థులకు రూ . నెలకు 3000 ఇస్తారు .

విద్యార్థి కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచే ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది .

తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో మరో పేపర్ లీక్ !!

విద్యార్థి అర్హతలు :
ఈ స్కాలర్‌షిప్ పొందే విద్యార్థులు తమ ఓజీపీఏ/సీజీపీఏ 10కి కనీసం ఏడు పాయింట్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే కనీసం 6.5 పాయింట్లు ఉండాలి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు ఐసీఏఆర్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులు స్వీకరించరు.

పూర్తి వివరాలకై దీనిపై క్లిక్ చేయండి .

https://www.icar.org.in/ ఈ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు సబ్‌మిట్ చేయొచ్చు.

దరఖాస్తు కు అవసరమైన పత్రాలు :

విద్యార్థి ఫొటోగ్రాఫ్
ఆధార్‌కార్డు
బ్యాంకు ఖాతా వివరాలు
సంతకం
వేలిముద్ర
అధికారులు ఇచ్చిన కండక్ట్, స్టడీ మెరిట్ సర్టిఫికెట్లు

మరిన్ని వివరాలకు 011-25847121 నంబరులో ఫోను ద్వారా ఐసీఏఆర్ అధికారులను నేరుగా సంప్రదించవచ్చు.

తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో మరో పేపర్ లీక్ !!

Share your comments

Subscribe Magazine