Education

Telangana S.S.C:విడుదలైన పదవ తరగతి హాల్ టిక్కెట్లు... ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

S Vinay
S Vinay

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదవ తరగతి హాల్ టికెట్లను విడుదల చేసింది. 10th క్లాస్ అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైటు లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోగలరు.

తెలంగాణ SSC పబ్లిక్ పరీక్ష హాల్ టిక్కెట్‌లను గురువారం విడుదల చేశారు. ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు మాట్లాడుతూ హాల్‌టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించామని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాలల నుండి నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చని సూచించారు.

అంతే కాకుండా నేటి నుంచి అనగా మే 12వ తేదీ నుంచి విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని,
10వ తరగతి విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్‌ తెలిపారు.

విద్యార్థులు ప్రతి పరీక్ష రోజున తమతో పాటు హాల్ టిక్కెట్‌ను తీసుకెళ్లాలి, లేని పక్షం లో వారు పరీక్ష రాయడానికి అనుమతించబడరు.

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడం ఎలా?

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి. - bse.telangana.gov.in
హోమ్‌పేజీలో, 'TS SSC మే హాల్ టిక్కెట్‌లు 2022' అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
తరువాత అడిగిన వివరాలను నమోదు చేయండి.
మీ TS SSC హాల్ టిక్కెట్‌లు మీ స్క్రీన్‌పై కనపడుతుంది..
తరువాత కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

మే 23 నుంచి జూన్ 1 వరకు ఎస్‌ఎస్‌సీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతుంది. ఈఏడాది అరగంట అదనంగా కేటాయించిన సంగతి తెలిసిందే. గతంలో మే 11 నుంచి మే 20 వరకు జరగాల్సిన పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షల కారణంగా వాయిదా పడ్డాయి.

కృషి జాగరణ్ 10 వ తరగతి విద్యార్థులకి 'ఆల్ ది బెస్ట్' చెబుతుంది.

మరిన్ని చదవండి.

Amul Recruitment 2022: : ప్రపంచంలోనే అతిపెద్ద పాల సహకార సంస్థలో ఉద్యోగ అవకాశాలు!

Share your comments

Subscribe Magazine