Kheti Badi

పచ్చిరొట్ట పంటల వల్ల ప్రయోజనాలు.

KJ Staff
KJ Staff
Green Manure
Green Manure

భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. దీనికోసం చాలామంది ఎరువులు వాడుతుంటారు. కానీ దీనివల్ల కొన్ని సంవత్సరాల్లో ఆ నేలలో పోషకాలు లోపిస్తున్నాయి.

పంటలు కలుషితం అవుతున్నాయి. వీటిని వీలైనంత తక్కువ వాడుతూ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చి రొట్టను ఉపయోగిస్తున్నారు చాలామంది. శాస్త్రవేత్తలు కూడా వీటి వినియోగాన్ని పెంచాలంటూ సూచిస్తున్నారు. మరి, ఈ పచ్చి రొట్ట వేయడం వల్ల పంటకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

* పచ్చి రొట్ట వల్ల నేల గుల్లగా మారి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.

* నేలలో సూక్ష్మ జీవులు పెరిగి జీవ రసాయనిక చర్యలు కూడా జరుగుతాయి. దీనివల్ల నేల సారం పెరుగుతుంది. ఉత్పాదకత సామర్థ్యం కూడా పెరుగుతుంది.

* నేలలో అందుబాటులోని చాలా రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయి.

* ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యతను నేలలోని సూక్ష్మ జీవులు పెంచుతాయి.

* పప్పు జాతి పంటల వల్ల రైజోబియం బ్యాక్టీరియా పెరగడం వల్ల ఎకరానికి 20 నుంచి 50 కేజీల నత్రజని అందుతుంది. ఈ మేరకు ఎరువులు తగ్గించుకోవచ్చు.

* కలుపు మొక్కలు పెరగకుండా ఇవి కాపాడతాయి.

* భూమి లోతుల్లో ఉన్న పోషకాలను కూడా ఉపరితలానికి తీసుకొచ్చి పంట మొక్కలు వాటిని వినియోగించుకునేలా మారుస్తాయి.

* పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి.

* పచ్చి రొట్టగా వేయదగిన పంటలు

Soil green manure
Soil green manure

పచ్చిరొట్టగా ఏ తరహా మొక్కలను పెంచాలన్నది మనం పంటలు పండిస్తున్న నేలపై ఆధారపడుతుంది. మొత్తంగా ఇలా పండించడానికి అనువుగా పదహారు రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయి. అవి జీలుగ, అవిసె, జనుము, వెంపలి, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుములు, గోడు చిక్కుడు, అజొల్లా, కానుగ, వేప, గ్లైరిసిడియా, జిల్లేడు, నేతల తంగేడు, కొండ మిరప మొక్కలను విత్తుకోవచ్చు.

వీటిలో జీలుగ పంటను చౌడు భూముల్లో వేస్తారు. ఎకరానికి 10 నుంచి పన్నెండు కిలోల విత్తనాన్ని ఇసుకతో కలిపి పొలం అంతా చల్లుకోవాలి. పూత దశకు వచ్చాక కలియ దున్నితే ఎకరానికి 9 నుంచి 10 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది. జనుమును అన్ని నేలల్లో పెంచవచ్చు. దీన్ని పశువులకు మేతగా కూడా వాడవచ్చు. పిల్లి పెసరను చౌడు భూములు తప్ప వేరే నేలల్లో పండించవచ్చు. వీటన్నింటినీ పది కేజీల విత్తనాలు వేస్తే ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది. పెసర, మినుము పంటలను వేయడం వల్ల పశు గ్రాసంతో పాటు భారీగా పచ్చి రొట్ట కూడా లభిస్తుంది

వీటిని రెండు రకాలుగా వేసుకుంటారు. ఒకటి జనుము, జీలుగ, పిల్లి పెసర, మినుము, పెసర వంటి మొక్కలన్నింటినీ విత్తనాలు దుక్కి దున్ని వెదజల్లాలి. పూత దశకు చేరుకున్న తర్వాత పొలంలో వీటిని కలియ దున్ని ఈ ఆకులు నేలలో మురిగిన తర్వాత పంటలు వేసుకోవాలి. వీటి కోసం ఎక్కువగా విత్తనాలు చల్లుకోవాలి. దీనివల్ల మొక్కలు వేగంగా, ఎక్కువగా పెరిగే అవకాశాన్ని ఏర్పర్చుకోవచ్చు. వేప, తంగేడు, కానుగ వంటి మొక్కలైతే వాటి కొమ్మలు, ఆకులు సేకరించి పొలంలో పూర్తిగా చల్లుకొని కలియదున్ని మురగనివ్వాలి. ఇవి మురిగిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. వీటిని వేసవి నెలల్లోనే అంటే ప్రధాన పంట వేయడానికి రెండు నెలల ముందుగానే నాటుకోవాలి. మురగడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రధాన పంట వేయడానికి కొన్ని వారాల ముందు దీన్ని కలియ దున్నుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే కలియ దున్నితే ఎక్కువ పోషకాలు నేలలోకి చేరుతాయి.

https://krishijagran.com/agripedia/organic-farming-know-the-advantage-and-benefits-of-using-green-manure/

https://krishijagran.com/agripedia/importance-of-soil-fertility-and-ways-to-improve-it/

Share your comments

Subscribe Magazine