News

పత్తి కొనుగోలులో దళారులదే పైచేయి .. రైతుల లాభాలకు గండి

Srikanth B
Srikanth B

పత్తి రైతుల బాధ ఎంత చెప్పుకున్న తక్కువే ఈఏడాది పంట పండించిన రైతులలో ఏ రైతు అయినా బాధ పడుతున్నాడంటే అది పత్తి రైతు కేవలం పత్తి రైతు మాత్రమే ,వానాకాలం పంటను అమ్మడానికి పత్తి రైతు చేయని ప్రయత్నమంటూ లేదు .. పత్తి అమ్మడంలో దళారుల చేతిలో మోసపోతున్న పట్టించుకునే వారే లేరు .. తెలంగాణ వ్యాప్తంగా పత్తి రైతులు ఎన్ని ఆందోళనలు చేసిన ప్రయోజనము లేకుండా పోయింది , ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం యాసంగి లో పత్తి సాగును ప్రోత్సహిస్తుంటే మరోవైపు వానాకాలం లో పండించిన పంటను కొనే నాధుడే లేదు .. దళారులు చెపింది రేటు ఇచ్చిందే మద్దతు ధర అన్న చందనం గ మారింది రైతుల పరిస్థితి .

 

పత్తి క్రయవిక్రయాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్​ యార్డులో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. గత అక్టోబర్‌ 14న కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఒక్కరోజు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదు. గత సంవత్సరం క్వింటాల్‌ పత్తి ధర రూ.9,500పైగా పలికితే ఈ ఏడాది ఏకంగా రూ.7,500కి పడిపోయింది. రైతులు అమ్మకానికి తెచ్చే పత్తిని తమ ద్వారానే కొనుగోళ్లు చేయాలని, లేకుంటే తమకు రావాల్సిన కమీషన్‌ రాకుండా పోతుందనే ఆలోచనతో కమీషన్‌ ఏజెంట్లు ఆందోళనకు దిగడం ప్రతిష్టంభనకు దారితీసింది. భారీగా వచ్చిన పత్తి వాహనాలన్ని యార్డులోనే వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పడింది. జోక్యం చేసుకున్న అధికారులు.. రైతుల సమక్షంలో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లతో సంప్రదింపులు చేయడంతో కొనుగోళ్లు ప్రక్రియ ప్రారంభమైంది.

మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం !

 

ఆదిలాబాద్​ జిల్లాలో పత్తి పంట కొనుగోళ్లు మొదలైనప్పుటి నుంచి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కమీషన్‌​ కోసం ఏజెంట్లు వారి ద్వారానే క్రమవిక్రయాలు జరపాలని డిమాండ్​ చేస్తున్నారని రైతులు తెలిపారు

ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి రైతులను దగా చేయడం షరా మాములుగానే సాగుతోంది. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోకపోవడంతో వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన కర్షకులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.

మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం !

Related Topics

CottonFarming

Share your comments

Subscribe Magazine