News

ఖమ్మం మార్కెట్ లో తేజ మిర్చి గరిష్ట ధర .. క్వింటాల్‌కు 23 వేలు !

Srikanth B
Srikanth B

ఖమ్మం తేజ మిర్చి ధర రోజు రోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తుంది గత మూడు రోజులుగా అంతకంతకు పెరుగుతూ ఈ రోజు క్వింటాల్‌కు 23 వేలు ధర పలికింది, గతవారం 21 వేలు ధర పలికి రికార్డు సృష్టించిన తేజ రకం మిర్చి ఇప్పుడు ఏకంగా క్వింటాల్‌కు 23 వేలు ధర పలికి కొత్త రికార్డు సృష్టించింది , ఇప్పటి వరకు తేజ రకం మిర్చికి ఇదే గరిష్ట ధర .

అంతర్జాతీయంగ డిమాండ్‌ ఎక్కువఉండడం .. దిగుబడి తగ్గడంతో .. రైతులపై కనక వర్షంలా కురుస్తున్నది. మార్కెట్‌ యార్డుకు గురువారం ఉదయం జెండా పాట సమాయానికి వివిధ జిల్లాల నుంచి 26,000 మిర్చి బస్తాలు వచ్చాయి. జెండా పాటలో క్వింటాల్‌ గరిష్ఠ ధర రూ.23,000, మధ్య ధర రూ.20,900, కనిష్ఠ ధర రూ.18,300 పలికింది. తాలు రకం మిర్చి క్వింటాల్‌ ధర రూ.14,000 పలికింది. కొద్ది రోజుల క్రితం వరకు ఖమ్మం మార్కెట్‌ నుంచి నేరుగా నౌకాశ్రయాలకు, అక్కడి నుంచి విదేశాలకు తేజా రకం మిర్చిని ఎగుమతి చేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం, మార్కెట్‌కు పంట రావడం తగ్గిపోవడంతో వ్యాపారులు పోటీ పడుతూ రేటు పెంచుతున్నారు .రాబోయే కొద్ది రోజుల్లో క్వింటాల్‌ ధర రూ.25,000కు చేరుకోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పంటకు ఆశించిన దానికంటే అధిక ధర రావడంతో రైతులు ఆనందం వ్యకతం చేస్తున్నారు .

మిర్చి రైతుల కష్టాలు.. భారీగా కమిషన్ వసూలు చేస్తున్న ఏజెంట్లు..

పెరుగుతున్న తెగుళ్ల దాడి దీనితో దిగుబడి పై తీవ్ర ప్రభావం పడడంతో మార్కెట్టుకు వచ్చే మిర్చి తగ్గింది దీనితో దళారుల మధ్య పోటీ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి అంటే కాకూండా తేజ రకం మిర్చికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉండడం కూడా కారణం , భారతదేశం నుంచి ప్రధానంగా చైనా నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు వస్తుండగా, వ్యాపారులు పోటీ పడి ధర పెంచుతున్నారు.దీనితో రైతుకు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యకతం చేస్తున్నారు .

మిర్చి రైతుల కష్టాలు.. భారీగా కమిషన్ వసూలు చేస్తున్న ఏజెంట్లు..

Related Topics

chilli crop

Share your comments

Subscribe Magazine