News

ఆంధ్రప్రదేశ్ 2022-23 వ్యవసాయ,అనుబంధ రంగాలకి వార్షిక బడ్జెట్ రూ. 43,053 కోట్ల కేటాయింపు . వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేస్తూ పెద్ద పీఠ

S Vinay
S Vinay

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ 2022-23లో భాగంగా మంత్రి కురసాల కన్నబాబు గారు వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు, ఇందులో వివరాలను చూసినట్లయితే వ్యవసాయానికి దాని అనుబంధ రానగలకి కలిపి రూ. 43,053 కోట్లను ప్రవేశపెట్టారు మొత్తం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వ్యసాయానికి కేటాయించింది 16.80 శాతం.కిందటి సంవత్సరం తో పోల్చితే ఈ సంవత్సరపు వ్యవసాయ బడ్జెట్ సుమారుగా రూ.11,797 కోట్లు పెరిగింది.

వ్యవసాయ,అనుబంధ రంగాలకి సంబంధించి ఆయా విభాగాల వారీగా కేటాయింపులు.(కోట్లలో)

వైస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ - 7020
ఉపాధి హామీతో వ్యవసాయ అనుసంధానం - 8329
వ్యవసాయ విద్యుత్ రాయితీ - 5000
పకృతి విపత్తుల సహాయ నిధి - 2000
వైస్సార్ -పీఎం ఫసల్ బీమా - 1802
సున్నా వడ్డీ పంట రుణాలు - 500
రాయితీ విత్తనాల సరఫరా - 200
పొలం బడులు - 30
సమగ్ర వ్యవసాయ పరీక్ష కేంద్రాలు - 50
వైస్సార్ జలకళ - 50
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి - 20
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన -1750
కృశోన్నతి యోజన - 760
జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ - 87

వైస్సార్ అగ్రి టెస్టింగ్ లాబ్స్ - 50
ఎరువుల బఫర్ స్టోరేజ్ - 40
ధరల స్థిరీకరణ నిధి - 500
వ్యవసాయ మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి -100
మత్స్య విశ్వవిద్యాలయాల భవనాలకి - 40
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ - 100
ఫాడర్ & ఫీడ్ డెవలప్మెంట్ - 72
పశు నష్ట పరిహారం - 50
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన -100
ఫిష్ లాండింగ్ సెంటర్లు - 100
వ్యవసాయన డ్రోన్లు - 200
ఫుడ్ ప్రాసెసింగ్ - 146
సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం -160
ఆచార్య నంది గోగు రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం - 421
వైస్సార్ ఉద్యాన వర్శిటీ - 60
శ్రీ వెంకటేశ్వరా పశు వర్శిటీ -122.50
మేకల గొర్రెల కొనులుగోలు - 309
మినీ గోకులాలు - 26
ఉద్యాన శాఖ - 554
పట్టు పరిశ్రమ - 99
పశు సంవర్ధక శాఖ -1027
మత్స్య శాఖ - 337
నీటి పారుదల రంగం - 11,482

మరిన్ని చదవండి

HDFC బ్యాంకు లో ఉద్యోగాలు, నిరుద్యోగులకు సువర్ణవకాశం ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.

స్పైసెస్ బోర్డ్ లో వివిధ ట్రైనీ పోస్టులకు సంబంధించి నియామకాలు స్టైపెండ్ నెలకి రూ 21000 పొందండి

Related Topics

agriculture budget

Share your comments

Subscribe Magazine