News

నకిలీ విత్తనాలను గుర్తించడానికి విత్తన ప్యాకెట్లకు బార్‌కోడ్‌..

Gokavarapu siva
Gokavarapu siva

నేడు మార్కెట్లోకి నకిలీ విత్తనాలు మరియు పురుగుమందులు ఎక్కవగా వస్తున్నాయి. వీటిని రైతులు పంటలు పండించడానికి వాడటం వలన డిబిబడులు రాక నష్టపోతున్నారు. రైతులకు ఈ నకిలీ విత్తనాలను గుర్తించడం కూడా చాలా కష్టంగా మారింది. అసలు విత్తనాలకు నకిలీ విత్తనాలకు వ్యత్యాసం తెలియకపోవడంతో ఇష్టంవచ్చినట్లుగా ప్రైవేట్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. నచ్చినట్లుగా నకిలీ విత్తనాలను మార్కెట్ లోకి పంపిణి చేస్తున్నారు.

ప్రభుత్వం మార్కెట్ లోకి ఈ కల్తీ విత్తనాలను మరియు కల్తీ పురుగుమందులని రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుంది. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు 'సీడ్‌ ట్రేసబిలిటీ' బార్‌కోడ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బార్‌కోడ్‌ను రైతులు స్కాన్ చేసి అసలువో లేదా నకిలీవో గుర్తించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చే వర్షాకాలం నుండి ఈ ప్రక్రియలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఎక్కువశాతం కల్తీ అనేది పురుగు మందులతో పోలిస్తే విత్తనాల్లోనే జరుగుతుంది అని అధికారులు తెలిపారు. కొన్ని పంటల్లో ఐతే నకిలీకి మరియు అసలు విత్తనాలకు వ్యత్యాసం తెలుసుకోవడం చాలా కష్టం అని ఆనుతున్నారు. మరొకవైపు పెద్ద ప్రైవేటు కంపెనీలు ఐతే ఎక్కువ శాతం పండించే వరి విత్తనాల్లో మొలక శాతం మరియు దిగుబడుల్లో పెద్దగా ఇబ్బందులుండవని తక్కువ రకం విధానాలను మార్కెట్ లోకి నెట్టేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..

వేసవి తీగ జాతి కూరగాయ పంటల సాగులో మెలకువలు!

కానీ ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన ఈ నూతన ప్రక్రియ వలన మార్కెట్ లో కల్తీ విత్తనాలను అరికట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఖచ్చితంగా కొత్తగా సంచిపై కోడ్‌ ఉండేలా నిబంధన తెస్తే నకిలీలను కచ్చితంగా నియంత్రిచవచ్చని తెలుపుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు పురుగు మందుల విషయంలో ఈ సూత్రం పాటిస్తున్నాయి.

రైతులు ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఏ విత్తనం ఎక్కడ ఉత్పత్తి అవ్వింది, వాటిని ఎక్కడ ప్రాసెస్ చేశారు, ఏ కంపెనీ ప్యాకింగ్ చేసింది అన్న విషయాలు తెలుస్తాయి. ఆ విత్తనాలను మార్కెట్ లోకి ఎవరు విక్రయించారు అనేది కూడా తెలుసుకోవచ్చు. విత్తనాల యొక్క నాణ్యత మరియు జన్యు స్వచ్ఛత కూడా ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేసి తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

వేసవి తీగ జాతి కూరగాయ పంటల సాగులో మెలకువలు!

మార్కెట్ లో ఇప్పటివరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలన్నీ ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ ను విత్తన బస్తాలకు అతికించి మార్కెట్ లోకి పంపేవారు. ఈ లేబిల్ లో కేవలం విత్తన నాణ్యత మరియు సంస్థ వివరాలు మాత్రమే ఉంటాయి. బార్‌కోడ్‌ ఉంటే అన్ని విషయాలు తెలుసుకునే వీలుంటుంది. ఎక్కడైనా గింజ మొలకెత్తకుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందనేది వెంటనే తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

వేసవి తీగ జాతి కూరగాయ పంటల సాగులో మెలకువలు!

Related Topics

barcode seeds quality

Share your comments

Subscribe Magazine