News

నేడు జైల్లో చంద్రబాబు నిరాహారదీక్ష.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన

Gokavarapu siva
Gokavarapu siva

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు జరిగిన అన్యాయాన్ని అరికట్టేందుకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేదీన నిరసన దీక్ష చేపట్టనున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. టీడీపీలోని ప్రముఖ వ్యక్తి నారా భువనేశ్వరి కూడా ఈ రోజున తన దీక్షను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ దీక్షలకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల టీడీపీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పౌరులు ఐక్య ప్రదర్శనలో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు రాష్ట్రంలో ప్రతి పౌరుడు వారి ఇళ్లు, వారు ఉన్న ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో సౌండ్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. లోకేష్ విజ్ఞప్తికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి గూబ గుయ్యమన్నట్టు పదే పదే నినాదాలు చేస్తూ తమ అసమ్మతిని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. వచ్చే నెలలోనే పీఎం కిసాన్ యోజన 15వ విడత డబ్బులు జమ..!

మోత మోగించిన ప్రజానీకానికందరికీ టీడీపీ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడును 22 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా నిలబడాలని నిశ్చయించుకున్న పౌరులు, ఈ అరెస్టును నిస్సందేహంగా ఖండించారు, ఇది చరిత్రలో ప్రతిధ్వనించే ఒక ముఖ్యమైన సంఘటనగా భావించారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న అన్ని అభియోగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. వచ్చే నెలలోనే పీఎం కిసాన్ యోజన 15వ విడత డబ్బులు జమ..!

Related Topics

chandrababu tdp hunger strike

Share your comments

Subscribe Magazine