News

తిరుమలలో చిక్కిన చిరుత .. భక్తులకు ఊరట!

Srikanth B
Srikanth B
తిరుమలలో చిక్కిన చిరుత .. భక్తులకు ఊరట!
తిరుమలలో చిక్కిన చిరుత .. భక్తులకు ఊరట!

తిరుపతి దర్శనానికి వెళ్లిన ఒక ఆరేళ్ళ చిన్నారిని పొట్టన పెట్టుకున్న చిరుత పులి ఆకుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది . కాలినడకన దర్శననానికి వెళ్లే వారిని భయబ్రాంతులకు గురిచేసిన ఈ ఘటనతో అప్రమతమైన అధికారులు కాలినడకన దైవదర్శనం టిక్కెట్లు తాత్కాలికంగా నిలిపివేశారు.

 

చిరుత భయంతో అలిపిరి నడకమార్గంపై ఆంక్షలు విధించింది టీటీడీ. 15 సంవత్సరాల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాలినడక మార్గంలో అనుమతించట్లేదు. చిన్నారులందరికీ వారి తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉన్న ట్యాగ్ లు వేస్తున్నారు. నరసింహ స్వామి ఆలయం వరకు 100 మంది భక్తులను ఒకే సారి గుంపులు గుంపులుగా పంపుతున్నారు. ఆ గుంపులకు ముందు, వెనక సెక్యూరిటీ ఉంటున్నారు. ప్రస్తుతం చిరుత బోనులో చిక్కడంతో భక్తులు, అటవీ సిబ్బంది, టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

అయితే ఇప్పుడు ఆ చిరుతను ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో చిరుతను అడవిలో తిరిగి వదిలేయడంతో అది మరోసారి నడకమార్గం వైపు వచ్చి బాలికపై దాడి చేసి హతమార్చింది. ఇప్పుడు దొరికిన చిరుతను ఈసారి కూడా అడవిలోకి వదిలిపెడితే టీటీడీపై మరిన్ని విమర్శలు వచ్చే అవకాశముంది. అందుకే దాన్ని జూ కి తరలించే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

Related Topics

TTD

Share your comments

Subscribe Magazine