News

రాష్ట్రంలో రైతులకు పరిహాసంగా మిగిలిన నష్ట పరిహారం..

Gokavarapu siva
Gokavarapu siva

ఇటీవలి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలు అనేవి నష్టపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంట నష్టాన్ని కలిగించాయి, రైతులకు దిగుబడిలు బాగా తగ్గుదల పట్టడం వలన పంటకోత కష్టాలపై ఆందోళనలను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది.

రాష్ట్రంలో భారీగా పంట నష్టం జరిగితే ప్రభుత్వం కేవలం 83 ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నష్టం కొండంత జరిగితే గోరంత మాత్రమే జరిగినట్టు సర్వేలో తేల్చారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారం కొండంతలో గోరంత అని అంటున్నారు. ప్రభుత్వం నష్టం జరిగిన పంటల్లో 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన వాటినే పరిగణలోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా ఈ అకాల వర్షాల కారణంగా 200 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఈ మామిడి రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. నష్టపోయిన పంటలను పరిశీలించిన అధికారులు అకాల వర్షాల కారణంగా 25 నుంచి 30 శాతం మాత్రమే కాయలు రాలిపోయాయని, 33 శాతం కాయలు రాలిపోతేనే నష్ట పరిహారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రేషన్ కార్డ్ కొత్త నిబంధనలు..కేంద్రం నిర్ణయంతో ప్రజలకు తీపి కబురు

జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి సుమారుగా 772 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ఒక అంచన వేశారు. కానీ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో కేవలం 89.24 ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్టు నిర్ధారించారు. మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడు పంటలు నేలవాలగా, 200 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయినట్లు హార్టికల్చర్‌ అధికారులు అప్పట్లో వెల్లడించారు. ఇంతలా నష్టం జరిగిన కానీ, 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన పంటలకు మాత్రమే నష్ట పరిహారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. దీనితో నష్ట పోయిన రైతుల్లో ఆందోళన మొదలైంది.

ఇది కూడా చదవండి..

రేషన్ కార్డ్ కొత్త నిబంధనలు..కేంద్రం నిర్ణయంతో ప్రజలకు తీపి కబురు

Related Topics

Crop loss Heavy rain

Share your comments

Subscribe Magazine