News

cooking oil price : వంట నూనె ధరలు తగ్గే అవకాశం .. !

Srikanth B
Srikanth B
Cooking oil price
Cooking oil price

సామాన్య ప్రజలకు మరో శుభవార్త అంతర్జాతీయ మార్కెట్లలో వంట నూనె ధరలు తగ్గుముఖంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ ఉంటుంది కాబట్టి వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దానికి నిదర్శనంగా ఢిల్లీ మార్కెట్లో నూనె ధరలు పడిపోవడం దీనికి నిదర్శనంగా చూపుతున్నారు , గత వారంలో ఢిల్లీ మార్కెట్లో వంట నూనె ధరలు స్వల్ప తగ్గుదల కనిపించింది .

 

ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పామ్ సాగును పెంచాలని పలువురు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసిందని వర్గాలు తెలిపాయి. దేశీయంగా పౌల్ట్రీ, డెయిరీ రంగాల వారు నూనె తీసిన కేకును దాణాగా వినియోగిస్తారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

మరోవైపు పామ్ ఆయిల్ వివిధ వంటలలో వీరి గ వాడే ఈ నూనె కోసం అధిక మొత్తంలో భారత దేశం దిగుమతి పై ఆధారపడి ఉంది . ఏటా ప్రతి పౌరుడు సగటున 16. 5 కిలోలు నూనెను తీసుకుంటుండంగా భారత దేశంలో వీటియొక్క ఉత్పత్తి 8. 5 కిలోలుగా ఉంది .దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాలు పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహిస్తున్నాయి . భారతదేశలోనే పామ్ ఆయిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా 2020-2021 కు గాను 204016 మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి తో ఆంధ్రప్రదేశ్ నిలువగా 39392 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ రెండొవ స్థానంలో నిలిచింది .

దేశ వ్యాప్తముగా పామ్ ఆయిల్ సాగు విస్తరిస్తే దిగుమతి తగ్గి , నూనె ధరలు మరింత తక్కువ ధరలకు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు .

ఇల్లు కట్టాలనుకునే వారికీ 15 రోజుల్లో 3 లక్షలు-సీఎం కెసిఆర్

Share your comments

Subscribe Magazine