News

కరోనా వైరస్ ఓమిక్రాన్ BF.7 లక్షణాలు .. ఇ లక్షణాలు మిలో కనిపిస్తే జాగ్రత్త !

Srikanth B
Srikanth B

 

కరోనా మహమ్మారి ఇప్పటికి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది .. చైనాలో మళ్ళి కరోనా వైరస్ తాండవం చేస్తుంది దీనిపై చైనా ప్రభుత్వం అధికారం గ ప్రకటించనప్పటికీ సామజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఫోటోలలో హాస్పిటల్ మరియు స్మశాన వాటిక వద్ద పెద్ద మొత్తం లో క్యూ లైన్లొ కనిపించడం ప్రపంచాన్ని మళ్ళి కలవరానికి గురిచేతుంది .

 

ప్రపంచంలో ముఖ్యంగా చైనా, కొరియా, బ్రెజిల్‌, జపాన్‌ వంటి దేశాల్లో కొవిడ్‌ అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిందిగా కేంద్రం సూచించింది. అందుకు అనుగుణంగా ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రచిస్తున్నారు. గతంలో మాదిరిగా ఎయిర్‌పోర్టులో తనిఖీలకు చేపట్టింది .

ఈ లక్షణం కనిపిస్తే, వెంటనే అప్రమత్తంగా ఉండండి!
కరోనా వైరస్ ఓమిక్రాన్ రూపాంతరం వలె, దాని ఉప-రూపం BF.7 అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బలహీనత, వికారం, విరేచనాలు సాధారణంగా ఉంటాయి. వ్యాధి సోకిన రోగులకు కఫంతో కూడిన దగ్గు ఉండవచ్చు. అలాగే ఛాతీ పైభాగంలో, గొంతు దగ్గర నొప్పి ఉంటుంది. శ్వాసకోశ వ్యవస్థ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంతేకాకుండా వ్యాధి సోకిన రోగి తుమ్ములు, ముక్కు కారటం లేదా నాసికా రద్దీ సమస్యలను కూడా అనుభవిస్తారు.

కరోనా మళ్ళి విజృంభించే అవకాశం.. అప్రమత్తం చేసిన కేంద్రం

 

మీలో ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే, వెంటనే మేల్కొని కోవిడ్-19 పరీక్షలు చేయించుకోండి. వెంటనే క్యాంరెటైన్‌ పాటించాలి. కరోనా వైరస్ పరీక్ష నెగెటివ్ వచ్చే వరకు డాక్టర్‌తో అందుబాటులో ఉండండి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. పాజిటివ్ రిపోర్ట్ వస్తే డాక్టర్ సూచనలను కూడా పాటించండి.

కరోనా మళ్ళి విజృంభించే అవకాశం.. అప్రమత్తం చేసిన కేంద్రం

Share your comments

Subscribe Magazine