News

హిమాచల్ ప్రదేశ్, చంబాలో భూకంపం.....

KJ Staff
KJ Staff

హిమాచల ప్రదేశ్లోని, చంబాలో, గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.3 గా ఉన్నట్లు, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలోజి పేర్కొంది. అలాగే చంబా నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలో కూడా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనల ధాటికి ప్రజలు బయపడి ఇళ్ళనుండి బయటకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలోజి భూమికి దిగువున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలోజి నివేదించింది. చంబాలోని ఈ భూకంపం ధాటికి ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెల్సుతుంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో హిమాలయ ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ తీవ్రతతో భూకంపలు వస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని, చమోలీ, లాహొళ్, మొదలగు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ మధ్యనే తైవాన్లో సంభవించిన భూకంపం ఆ దేశానికి కొంత మేరకు నష్టాన్ని కలిగించింది. భూకంపం ధాటికి పలు బిల్డింగ్లు, విద్యుత్ కేంద్రాలు నేలకొరిగాయి. భూకంపంలో మరణించిన వారి సంఖ్యా 9 కి చేరుకుంది.

తైవాన్లోని ఈ భూకంపం, హువాయున్ నగరంలో, 18 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 గా నమోదయింది, గత 24 ఏళ్లలో ఇదే అతి పెద్ద భూకంపం. అంతేకాకుండా తైవానుతో పొరుగు దేశాలైన, జపాన్, వియత్నాం వంటి దేశాల్లో సునామి హెచ్చరికలు జారీ చేసారు. కాకపోతే టైవాన్ లో సంభవించిన ఈ భూకంపంతో సునామి ముప్పు తప్పింది. టైవాన్ ప్రభుత్వం నివేదిక ప్రకారం ఇప్పటివరకు 9 మంది భూకంపంలో మరణించారు. 900 వందలకు పైగా జనం గాయపడ్డారు. తైవాన్ ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

Share your comments

Subscribe Magazine