News

రికార్డు ధర పలుకుతున్న అల్లం ... లాభాల్లో రైతులు !

Srikanth B
Srikanth B
రికార్డు ధర పలుకుతున్న అల్లం ... లాభాల్లో రైతులు !
రికార్డు ధర పలుకుతున్న అల్లం ... లాభాల్లో రైతులు !

ఈ సంవత్సరం ఏ వస్తువు చుసిన కొంచం పీరంగానే వున్నాయి .. కేవలం టొమాటోలే కాదు ఎండాకాలంలో నిమ్మకాయలు ఒక్క నిమ్మకాయకీ రూ.10 పల్కి రికార్డు సృష్టించగా అల్లం -వెల్లుల్లి కొన్ని చోట్ల రూ. 400 కిలో పలికింది ఇక మిర్చి సంగంతి సరేసరి ఇలా ఏ నిత్యావసర వస్తువు కొందామన్నా పీరంగానే వున్నాయి దీనితో సామాన్యులు అవస్థలు పడుతున్నప్పటికీ ఈ సంవత్సరం రైతులు కొంతమేర లాభాలను ఆర్జిస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు పెరిగిన అల్లం ధరలతో అల్లం సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు ధరతో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడం రైతులకు ఉపశమనాన్ని ఇస్తుంది . కిలో రూ.250 నుంచి రూ.300 వరకు అల్లంను రిటైల్‌ వ్యాపారులు అమ్మకాలు విక్రయిస్తున్నారు. సంత వ్యాపారులంతా మన్యం అల్లంను భారీగా కొనుగోలు చేస్తున్నారు. గత రెండు నెలల నుంచి అల్లంకు రికార్డు ధర నెలకొంది.

ప్రస్తుతం హైబ్రిడ్‌ రకం అల్లంను కిలో రూ.180.దేశవాళీ అల్లం కిలో రూ.140తో వ్యాపారులు కొనుగోలు చేసి విశాఖ, విజయనగరం, గాజువాక, తుని, రాజమండ్రి ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రుణమాఫీ కోసం 31 లక్షల రైతుల ఎదురుచూపు ..


కొంతమంది వ్యాపారులు నేరుగా గిరిజన గ్రామాలకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో గిరిజనులు హైబ్రిడ్‌, దేశవాళీ అల్లాన్ని విస్తారంగా సాగు చేస్తున్నారు. ఒడిశాలోని కోరాపుట్టు జిల్లా వ్యాప్తంగాను గిరిజన రైతులు అల్లంను భారీగా పండిస్తున్నారు. ఈఏడాది అల్లం కొనుగోలు వినియోగదారులకు భారంగా మారినప్పటికీ రైతులు, వ్యాపారులు మంచి ఆదాయం పొందుతున్నారు.ఆదివారం అరకులోయ లో వ్యాపారాలు భారీ మొత్తంలో రైతుల నుంచి అల్లం కొనుగోలు చేసారు.

రుణమాఫీ కోసం 31 లక్షల రైతుల ఎదురుచూపు ..

Related Topics

benefits of garlic

Share your comments

Subscribe Magazine