News

రైతులకు శుభవార్త : యూరియాపై సబ్సిడీ కొనసాగింపు...

Srikanth B
Srikanth B

రైతులకు ప్రభత్వం శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం సబ్సిడీలపై కోత ఉంటుందన్న విషయానికి సమాధానమిస్తూ ఎరువులపై ఎటువంటి కోత ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం. దేశంలోని ఎరువుల డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. యూరియాపై ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఈ కారణంగానే రైతులు యూరియా బస్తాను రూ.266.50కి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీని తొలగిస్తే ఒక్కో బస్తా యూరియాకు రూ.2450 వెచ్చించాల్సి వస్తుంది.

రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా పార్లమెంట్ హౌస్‌లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పోషకదారిత ఎరువులపై సబ్సిడీ ను తొలగించే ప్రసక్తే లేదని రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందించడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు .

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ లైసెన్సు కోర్సు.. దరఖాస్తు చేసుకోండి ఇలా !

బస్తా డిఎపి ఎరువుల ధర రూ.1350. సబ్సిడీని తొలగిస్తే దాని ధర రూ.4073 అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొనలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ ప్రభావం వ్యవసాయ రంగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది, దేశంలో నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరుగుతాయి సామాన్య ప్రజలు ఎవరు కూడా ధాన్యాన్ని కొనుక్కునే పరిస్థితి ఉండదు కాబ్బటి ఇటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదు .

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ లైసెన్సు కోర్సు.. దరఖాస్తు చేసుకోండి ఇలా !

Related Topics

Bio fertilizers

Share your comments

Subscribe Magazine