News

రైతులకు శుభవార్త..చుక్కల భూముల పత్రాల పంపిణీ

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో రైతులకు చుక్కల భూముల పత్రాలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన .జి.ఓ. విడుదల చేశారు. ఈ విషయం తెలిసుకున్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో 23 వేల మంది రైతులు లబ్ధి చేకూరుతుంది. ఈ భూముల సమ్యసలను పరిష్కనించడానికి ప్రభుత్వం .జి.ఓ.163ని జారీ చేసింది. ఈ భూముల పట్టాలను ప్రభుత్వం త్వరలోనే రైతులకు అందించనున్నారు. దాదాపు 23,023 రైతులకు చెందిన 43,270 ఎకరాలను ఒకేసారి చుక్కల భూముల జాబితా నుంచి తొలగించటం జరిగింది. త్వరలో చుక్కల భూముల రైతులకు సీఎంగారు స్వయంగా పట్టాలు పంపిణీ చేస్తారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలు రాయిగా భావించాలి. ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశం.

రైతులను ఈ చుక్కల భూముల సమస్యలు ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమ్యసను ఎక్కువగా నెల్లురు జిల్లా రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ నిర్ణయంతో నెల్లూరు రైతులు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వీఆర్‌ఓ, ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్‌.. చివరకు సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత చుక్కల భూమి నుంచి తొలగించాలనే నిబంధనను ముఖ్యమంత్రి సరళీకరించారు.

ఇది కూడా చదవండి..

గాలి వానలకు మామిడి చెట్ల పై మిగిలింది 30 శాతం కాయలే...

చుక్కల భూమి సమస్య పరిష్కారం కోసం గతంలో చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా.. సీఎం శ్రీ వైయస్‌ జగన్, సరళీకృత నిబంధనలు తీసుకొచ్చారు. ఇందుకు జిల్లా రైతుల పక్షాన ముఖ్యమంత్రిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.

ప్రభుత్వం రైతులకు భూమి అధికారాలు అప్పగించేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయమని ముఖ్యమంత్రి సూచించారు. కేవలం నెల్లూరు జిల్లాలోనే 40 వేల ఎకరాల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతుల సమస్యలను తొలగించడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..

గాలి వానలకు మామిడి చెట్ల పై మిగిలింది 30 శాతం కాయలే...

Related Topics

Andhrapradesh

Share your comments

Subscribe Magazine