News

పెన్షనదారులకు శుభవార్త ... 6శాతం వడ్డీతో పెన్షన్ చెల్లింపుకు ఆదేశాలు

Gokavarapu siva
Gokavarapu siva

కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. అన్ని రంగాల వారిని ఆర్ధికంగా చాలా దెబ్బతీసింది. నిత్యావసర ధరలు అన్ని పెరిగిపోవడం వలన ప్రజల దగ్గర డబ్బు లేక ఆర్ధికంగా చాల ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో రిటైర్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాల దారుణంగా మారింది. రాష్ట్రం యొక్క ఆర్ధిక పరిస్థితికి బాగాలేదని రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లను చెల్లించకుండా వాయిదా వేసింది. దీని వాలన రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ధికంగా చాల ఇబ్బంది పడ్డారు.

ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసింది. అది ఏమిటంటే కోవిద్ సమయంలో రాష్ట్ర పరిస్థితి ఆర్ధికంగా బాగాలేదని రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించకుండా నిలిపివేసిన పెన్షన్‌లో కొంత భాగాన్ని ఆరు శాతం వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఇది ఇలా ఉండగా పెన్షన్ దారులు, దీనితో ఏకీభవించలేదు. పింఛనుదారులు ప్రభుత్వం చెల్లించని పెన్షన్లపై 12 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేసారు. దీని కొరకు సంబంధించిన పిటిషన్‌లను పింఛనుదారులు హైకోర్టులో దాఖలు చేసారు. తద్వారా హైకోర్టు పింఛనుదారులకు సుప్రీమ్ కోర్టు పెన్షన్లపై చేసిన సవరణల గురించి వివరించి సమస్యను పరిష్కరించింది.

ఇది కూడా చదవండి..

పోడు రైతులకూ రైతు బంధు, రైతు బీమా-స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

సుప్రీం కోర్టు 2021లో పెన్షన్‌లపై వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి మార్చింది. పింఛనుదారులకు పెన్షన్లు చెల్లించకుండా వాయిదా వేయడానికి కోవిడ్ వలన రాష్ట్రంలో అస్థిర పరిస్థితికి కారణమైంది అని ప్రభుత్వం పేర్కొంది. దీనివలన పెన్షన్‌ చెల్లింపును వాయిదా వేసే ఎంపిక జరిగిందని పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఉత్తర్వుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, అదనపు వడ్డీతో పెన్షన్ బకాయిలను క్లియర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని, వడ్డీ చెల్లింపు సమర్థనీయం కాదని హైకోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి..

పోడు రైతులకూ రైతు బంధు, రైతు బీమా-స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Related Topics

pension

Share your comments

Subscribe Magazine