News

పోడు రైతులకూ రైతు బంధు, రైతు బీమా-స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Srikanth B
Srikanth B


ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పోడు భూమి రైతులకు పట్టాలు పంపిణి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలకూ బలం చేకూర్చే విధంగా పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరించి పొడు రైతులకు పట్టాలను పంపిణి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

 

త్వరలోనే సర్వేలు చేసి అర్హులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. పట్టాలు పొందిన పోడు రైతులకు రైతు బంధు, రైతుభీమా పథకాలు వర్తిస్తాయన్నారు. వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనా నికి ఆదివారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సయ్యదూరండాలో జరిగిన జగదాంబ, సేవాలాల్ మహారాజ్ ఆలయ వా ర్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సందేశం, బోధనలు, సూచనలు అందరూ ఆచరించాలని తెలిపారు .

3 రోజుల పాటు హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

భవిష్యత్లో అడవులను నరకవద్దని, ఆరోగ్యంగా బతకడానికి పర్యావరణాన్ని కాపా డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సిద్ధాపూర్రిజర్వాయర్, జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ద్వారా ఎక్కువగా లబ్ధిపొందేది బంజా రేలేనన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించి ప్రోత్సాహించినందుకు బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రికి దేశంలోనే ' బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్, గ్రేడ్-1' అవార్డు వచ్చిందని స్పీకర్ పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మనోపోచారం భాస్కర్రెడ్డి, లీడర్లు పోచారం సురేందర్రెడ్డి పాల్గొన్నారు.

3 రోజుల పాటు హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Share your comments

Subscribe Magazine