News

గుడ్ న్యూస్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం మంజూరు..

Gokavarapu siva
Gokavarapu siva

ఇటీవలి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడ్డాయి. ఈ అకాల వర్షాలతో రైతులకు పండించిన పంటలు అధిక మొత్తంలో నష్టపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పర్యటించిన విషయం తెలిసిందే.

గత నెలలో 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు కొన్ని అసాధారణ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు మరియు వడగళ్ళు వర్షాలు కూడా కురిశాయి. వర్షాల కారణంగా యాసంగిలో పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రధానంగా మొక్కజొన్నపంటకు నష్టం వాటిల్లగా అక్కడక్కడా ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఫలితంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని గతనెల 23వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

రాష్ట్రప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు చేసింది. రైతులకు జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లిస్తామని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో 18,258 మంది రైతులకు చెందిన 23,632.17 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,978 మంది రైతులకు చెందిన 1,435 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు నిర్ధారించారు. ఈమేరకు రూ.25.06 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్: ఆర్బీకేల ద్వారా తక్కువ ధరలకే మిర్చి విత్తనాలు..

కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వర్షంతో దెబ్బతిన్న పంటలను అధికారులు సర్వే చేశారు. పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తూనే సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించారు. వ్యవసాయశాఖ సమగ్ర సర్వే నిర్వహించి ఎంతమేర పంట నష్టం జరిగిందో నిర్ధారించి నష్టపరిహారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 33 శాతం పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

26 జిల్లాల్లో 1,30,988 మంది రైతులు సాగు చేసిన పంటలు 1,51,645.20 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందుకోసం రూ.151,64,55,000 పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో ఖమ్మం జి ల్లాలో 23,632.17ఎకరాల్లో పంట నష్టపోయిన 18,258మంది రైతులకు రూ.23,63,24,250 పరిహారం మంజూరు చేశారు. ఇక భద్రాద్రి జిల్లాలో 1,978 మంది రైతులకు చెందిన 1,435 ఎకరాల్లో పంటలకు రూ.1.43,52,500 పరిహారం విడుదలైంది. నష్టపరిహారాన్ని 90 రోజుల్లోగా నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్: ఆర్బీకేల ద్వారా తక్కువ ధరలకే మిర్చి విత్తనాలు..

Share your comments

Subscribe Magazine