News

మనీ మనీ మోర్ మనీ...కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.13.5 కోట్లు జమ!

S Vinay
S Vinay

చెన్నై నగరంలోని కొంతమంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లో అకస్మాత్తుగా 10,000 రూపాయల నుండి 50 లక్షల వరకు జమ అయ్యాయి. దీనితో ఖాతాదారుల అన్నదానానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఇలా పెద్ద మొత్తంలో నగదు జమ అవ్వడానికి దారి తీసిన కారణాల గురించి తెలుసుకుందాం.

చెన్నై నగరంలోని త్యాగరాజ నగర్ బ్రాంచ్‌కి సంబందించిన 100 ఖాతాల్లో కస్టమర్లకు 13 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. రూ.10వేల నుంచి రూ.50లక్షల వరకు పెద్ద మొత్తంలో నగదు క్రెడిట్ అయ్యింది. తమ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయినట్లు మొబైల్‌కి మేసేజ్ రావడంతో జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు, దీనికి ద్రువీకరించడానికి కొందరు ప్రజలు ఎటిఎం లలో విచారణ జరుపగా మరికొందరు ఏకంగా ఆన్ లైన్ లో నగదు ను బదిలీ చేసుకున్నారు.

భాగంగా కొత్త సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను ప్రవేశపెట్టడమే దీనికి ప్రధాన కారణమని ఇందులో ఏర్పడ్డ సాంకేతిక లోపలే ఈ ప్రక్రియ కి దారి తీశాయని బ్యాంకుపేర్కొంది.ఖాతాలలో జమ చేసిన అదనపు డబ్బును ఎవరైనా విత్ డ్రా చేసారా అన్న విషయాన్నీ బ్యాంకు పరిశీలిస్తోంది.అంతే కాకుండా ఆయా బ్యాంకు ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేసారు.కానీ అప్పటికే కొందరు కస్టమర్లు డబ్బు విత్ డ్రా చేసేశారు, మరి కొంతమంది ఆన్ లైన్ లో నగదు బదిలీ చేసుకున్నారు.మరోవైపు ఈ విషయంపై ఫెడరల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్లు సమాచారం.ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది తమకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

మరిన్ని చదవండి.

ఈపిఎఫ్ అకౌంట్ లో మార్పులు...ఇలా చేయకపోతే డబ్బులు రావు!

పోస్టాఫీస్‌ పథకం: నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టి...రూ. 35 లక్షలు పొందండి!

Share your comments

Subscribe Magazine