News

అలర్ట్‌:హైదరాబాద్‌లో నేడు మళ్ళి వానలు ..

Srikanth B
Srikanth B
అలర్ట్‌:హైదరాబాద్‌లో నేడు మళ్ళి వానలు ..
అలర్ట్‌:హైదరాబాద్‌లో నేడు మళ్ళి వానలు ..

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడేలా లేవు ఇప్పటికే కురిసిన వర్షాలకు కాలనీలు నీట మునిగివుంటే నేడు హేయద్రాబాద్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది . హైదరాబాద్‌లో మరో గంటలో భారీ వర్షం కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని.. పటాన్‌ చెరు, ఆర్‌సీపురం, హఫీజ్‌పేట్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్‌, అల్వాల్‌, బాలనగర్‌, నేరేడ్‌మెట్‌, కంటోన్మెంట్‌, కోంపల్లితో పాటు ధూల్‌పల్లి శివార ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అయితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వారం పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో.. వరద నీరు పోటెత్తింది. వరదలు పొటెత్తడంతో జలశాయాలు నిండుకుండల్లా మారాయి.


తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా జన జీవనం స్తంభించింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వరద ఉద్రితికి 30 మంది కొట్టుకుపోగా, 18 వరకు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

రికార్డు ధర పలుకుతున్న అల్లం ... లాభాల్లో రైతులు !

మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట మునిగాయి. జంపన్న వాగులో కొట్టుకు పోయి 8 మంది మరణించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిని వరదనీరు ముంచెత్తింది. దీనితో మోరంచపల్లి గ్రామస్థులు ఇళ్లపైనా , ఇంటి సజ్జలపైకి ఎక్కి ప్రాణలను కాపాడుకున్నారు .

భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి . నిర్మల్ జిల్లా సిరాల చెరువుకు గండి పడటంతో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రికార్డు ధర పలుకుతున్న అల్లం ... లాభాల్లో రైతులు !

Related Topics

ap rain alert

Share your comments

Subscribe Magazine