News

అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం ?

KJ Staff
KJ Staff


'యుగ' 'ఆది' అనే పదం నుండి ఉగాది వచ్చింది. ఈ రోజు మన తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన రోజు. మన తెలుగు పంచాంగం ప్రకారం నేటి నుండి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది గ్రీష్మ ఋతువులో చెట్ల ఆకులు అన్ని రాలిపోయి, వసంత ఋతువులో చెట్లు మరల చిగురించి కొత్త రూపాని సంతరించుకుంటాయి అదే విధంగా, మనిషి జీవితంలో కూడా కొత్త ఆశలతో ముందుకు సాగేందుకు, ఉగాదిని ప్రతీకగా జరుపుకుంటారు.

మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. ఉగాది పండుగను జీవిత కలగమనానికి ప్రతీకగా భావిస్తారు. హిందూ క్యాలండర్ యొక్క కాలక్రమం 60 సంవత్సరాలు, ఈ చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. 60 సంవత్సరాలు పూర్తియైన తర్వాత, తిరిగి మొదనుండి ఈ కలగమనం మొదలవుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం ఉగాదిని క్రోధినామ సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం మొత్తం తమ గ్రహాల స్థితిగతులు, ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు, ప్రజలు పంచాంగ శ్రవణం చేస్తారు. ప్రతీ రాశివారుకి తమ నక్షత్రం, బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో, పంచాంగ శ్రవణం ద్వారా పూజారులు తెలియచేస్తారు.

ఉగాది సందర్భంగా ప్రజలు తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలను సందర్శించి, దేవుని దర్శనం ద్వారా తమ నూతనాదిని ప్రారంభిస్తారు. జీవితంలోని కష్టసుఖాలు, లాభనష్టాలు, అన్ని ఉంటేనే జీవితం అని ఉగాది తెలియచేస్తుంది. ఉగాది పచ్చడిని షడ్రుచులు జీవితంలో ఎదురుకునే అన్ని పరిస్థితులకు చిహ్నంగా నిలుస్తాయి. ఈ పండుగను కేవలం తెలుగు రాష్టాల్లోనే కాకుండా భారతదేశంలోని అనేక చోట్ల వివిధ పేర్లతో జరుపుకోవడం విశేషం. తమిళనాడులో పుత్తాండు అని, మహారాష్ట్రలో గుడి పడ్వా అని మలాయిలు విషు అని, సిక్కులు వైశాఖి, ఇంకా బెంగాల్లో పోయ్ లా బైశాకి అనే పేర్లతో జరుపుకుంటురు.

Share your comments

Subscribe Magazine