News

కంటి వెలుగు పథకం : కంటి వెలుగు పథకం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలి -మంత్రి హరీష్ రావు

Srikanth B
Srikanth B
Kanti Velak Scheme Phase 2
Kanti Velak Scheme Phase 2

Kanti Velak Scheme: Kanti Velak Scheme should achieve Guinness book record - Minister Harish Rao
కంటి వెలుగు పథకం : కంటి వెలుగు పథకం గిన్నిస్ బుక్ రికార్డు సాదించాలి -మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చిన పథకం "కంటి వెలుగు " రెండొవ దశ త్వరలోనే ప్రారంభం కానున్నది , దీనికి సంబందించిన సమీక్ష సమావేశం నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రెండొవ దశలో1.5 కోట్ల మంది రోగులకు సేవలందించడం ద్వారా 'కంటి వెలుగు పథకం " గిన్నిస్ బుక్ రికార్డు సాధించి విధముగా కృషి చేయాలనీ రికార్డు సాధించేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దానికి సంబందించిన సిబ్బంది కొరత లేకుండా రాష్ట్రంలో వారం రోజుల్లో 960 మంది వైద్యుల నియామకం చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

కంటి వెలుగు నిర్వహణపై కలెక్టర్లతో సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్ రావు. మంగళవారం జగిత్యాలలో అన్ని జిల్లాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

హన్మకొండలో కంటి వెలుగు రెండో విడతకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం జగిత్యాలలో జరగాల్సిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి మంగళవారం ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో కంటివెలుగుపై సమీక్ష నిర్వహించారు.

మొదటి దశ ఎనిమిది నెలల పాటు కొనసాగిందని, రెండో దశను వంద రోజుల పనిదినాల్లో పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం పరీక్ష బృందాల సంఖ్యను 827 నుంచి 1,500కు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజలందరికీ ఉచితంగా అద్దాలు అందజేయనున్నారు. 30 లక్షల రీడింగ్, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసులు సరఫరా అవుతాయని, కార్యక్రమం ప్రారంభించేలోపు జిల్లాలకు అద్దాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామ్ సురక్ష యోజన నెలకు రూ. 1500 ప్రీమియం తో 35 లక్షలు ఆదాయం !

కంటి పరీక్షలు చేయించుకున్న ఒక నెలలోపు మందుల అద్దాల పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వం అన్నీ సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని, అయితే పథకాలు విజయవంతం చేసేందుకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. సక్రమంగా ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ తెలిపారు.

గ్రామ్ సురక్ష యోజన నెలకు రూ. 1500 ప్రీమియం తో 35 లక్షలు ఆదాయం !

Share your comments

Subscribe Magazine