News

మాండౌస్‌ తుఫాన్‌ : విత్తనలపై 80 % సబ్సిడీ .. ముంపునకు గురైతే కుటుంబానికి 2 వేల సాయం !

Srikanth B
Srikanth B

తుపాను కారణంగ ఏర్పడిన నష్టం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు . వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సాగిన ఏ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాలో ఏర్పడిన నష్టాలపై ఆరాతీసారు ..

తుపాను​ ప్రభావంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి.. వారం రోజుల్లో ముగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పంట నష్టాన్ని చూసి రైతులు నిరాశకు గురి కావొద్దని పేర్కొన్నారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలిని ఆదేశించారు .

అదేవిధముగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో.. రైతులకు విత్తనాలు అందించాలని ఇళ్లు ముంపునకు గురైతే కుటుంబానికి 2 వేల రూపాయలు ఆర్థిక సాయం, రేషన్‌ ఇవ్వనున్నట్లు సమావేశంలో తెలిపారు.

మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావం మరో 3 రోజులు .. నిలిచిపోయిన వడ్ల కొనుగోళ్లు ..

ముంపు ప్రాంతాలలో వరద నీరు ఇంట్లోకి వచ్చిన సరే వారికీ ఏ ఆర్థిక సాయం అందించే విధముగా కృషి చేయాలనీ సూచించారు . పట్టణాలు, పల్లెలు అనే తారతమ్యం లేకుండా బాధితులకు సహాయమందించాలని తెలిపారు.ఎవరికైనా ప్రాణ నష్టం సంభవించిన నమోదు చేసి నష్ట పరిహారం అందించాలని తెలిపారు .

మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావం మరో 3 రోజులు .. నిలిచిపోయిన వడ్ల కొనుగోళ్లు ..

Related Topics

Mandaus cyclone CM Jagan

Share your comments

Subscribe Magazine