News

MFOI సంరిది కిసాన్ ఉత్సవం 2024: గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్.

KJ Staff
KJ Staff

భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో కిసాన్ ఉత్సవాలు నిర్వహిస్తూ, రైతులను సన్మానిస్తున్న, MFOI సంరిది కిసాన్ ఉత్సవ్ ఇప్పుడు, ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో ఈ కార్యక్రమం, నిర్వాహణకు రంగం సిద్ధం అయ్యింది.

ఎక్కడ? ఎప్పుడు?

MFOI సంరిది కిసాన్ ఉత్సవం 2024, ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్పూర్లో గల, కృషి విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించబడుతుంది. రానున్న మార్చ్ 19, మంగళవారం రోజు, గోరఖ్పూర్ కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఉదయం 10:00 గ.లకు మొదలవుతుంది. ధనుక అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో, ఈ కార్యక్రమం రైతుల రాక కోసం ఎదురుచుస్తుంది. ఈ కార్యక్రంలో ఎన్నో విజ్ఞానాత్మకమైన కార్యక్రమాలతో పాటుగా, కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు కూడా పాల్గొని, వారి అమూల్యమైన సూచనలు రైతులకు అందజేస్తారు. రైతులు ఒకరితో ఒకరు వారి అనుభవాలను పంచుకునేందుకు ఇది ఒక మంచి కార్యక్రమం. మరొక్క ముఖ్య విశేషం ఏమిటంటే, లక్షాధికారి రైతులను, MFOI అవార్డ్స్ తో సత్కరించడం జరుగుతుంది.

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024: కొల్హాపూర్, మహారాష్ట్ర

రైతులు వ్యవసాయానికి చేస్తున్న విశేష సేవను గుర్తించి, వారిని ప్రత్సాహించి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా (MFOI) అవార్డ్స్ రూపొందిచడం జరిగింది. ఈ అవార్డ్స్ రూపకల్పనకు మూలా కారణమైన కృషి జాగరణ్ గత 27 సంవత్సరాలుగా, రైతుల మేలు కోసం అనేక కార్యక్రమాలను, ప్రవేశపెట్టింది. ఈ ధ్రోణిలోనే, ఈ MFOI సంరిది కిసాన్ ఉత్సవం కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. గత సంవత్సరం ఈ కార్యక్రమానికి వచ్చిన ఘన విజయాన్ని పురస్కరించుకుని, ఈ ఏడాది కూడా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో రైతుల కోసం పని చేసే వ్యవసాయ కంపెనీలు అన్నిటిని ఒక్క చోటకు చేర్చి, రైతులకు కావల్సిన ఉపకారణాలన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.


మీరు కూడా మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డు పొందడం కోసం ఇక్క ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి https://millionairefarmer.in/te/nominate-for-mfoi/

వ్యవసాయ లేదా వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న రైతులు ఈ అవార్డు పొందడానికి అర్హులు, కానీ వ్యవసాయం నుండి మీకు వచ్చే నికర ఆదాయం ఒక సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే మీకు అవార్డు లభిస్తుంది.

Share your comments

Subscribe Magazine