News

తెలంగాణలో అగ్రి హబ్ ప్రారంభించబోతున్న మంత్రులు..!

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోటి ఎకరాలకు నీరు అందించి రైతులకు బాసటగా నిలిచింది.తాజాగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వినూత్న మైన మార్పులు తీసుకురావడానికి రైతులకు మరియు ఆసక్తి కలిగిన యువతకు వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో అగ్రి హబ్ ప్రాజెక్టుని రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం
రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సకల హంగులతో భవనాన్ని నిర్మించింది.

ఎన్నో ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేస్తున్న అగ్రి హబ్ భవనాన్ని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సహా మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి, నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజులు సోమవారం దీన్ని ప్రారంభించనున్నారు.దీని అభివృద్ధికి గత ఏప్రిల్‌లో నాబార్డు సంస్థ 9 కోట్లు రూపాయల నిధులను అందిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ ఇలాంటి అగ్రి హబ్ కేంద్రాలు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో మధురై, కోయంబత్తూరులో, మరియు హరియాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో హిస్సార్‌లో మాత్రమే ఇప్పటివరకు ఏర్పాటయ్యాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన యువతకు మరియు రైతులకు అగ్రి హబ్ కేంద్రం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి అనుబంధంగా గ్రామీణ యువతకు చేరువలో జగిత్యాల, వరంగల్‌, వికారాబాద్‌లలో అగ్రిటెక్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాలుంటాయి.వినూత్న ఆలోచనలతో అక్కడికి వచ్చే గ్రామీణ యువతను ప్రోత్సహించి అగ్రిహబ్‌కు తీసుకొస్తారు. వ్యవసాయ పట్టభద్రులతోపాటు ఇతరులెవరికైనా వినూత్న ఆలోచనలొస్తే వాటిని అంకుర సంస్థల సహకారంతో పరికరాల రూపంలోకి తీసుకొచ్చి రైతుల వద్దకు చేర్చేందుకు ఇది వేదికగా ఉపయోగపడనుంది.

అగ్రిహబ్‌ ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో యువతను ప్రోత్సహించి వ్యవసాయ వాణిజ్యం వైపు మళ్లించేందుకూ దోహదం చేయనుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించడంతోపాటు వాటిలో సభ్యులుగా ఉండే రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి ఆయా సంఘాలను వాణిజ్య సంస్థలుగా మార్చడానికి అగ్రిహబ్‌ను వేదికలా మారిపోతుందని పలువురు ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Share your comments

Subscribe Magazine