News

దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా ముంబై..

Srikanth B
Srikanth B

దేశంలోనే అత్యంత కలుషిత నగరం ఏదైని ఎప్పుడు అడిగిన వినిపించే పేరు దేశ రాజధాని ఢిల్లీ అయితే ఇప్పుడు మాత్రం ఆ ఘనత ముంబయి నగరానికి దక్కింది , మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే. స్విట్జర్లాండ్ కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ 'ఐక్యూ ఎయిర్' తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వే వెల్లడించిన రిపోర్టు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా నిలిచింది .మరియు ఇది దేశంలోనే అత్యధిక కలుషిత నగరంగా ఢిల్లీ స్థానాన్ని భర్తీ చేసింది .

జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాననగరాల గాలినాణ్యతను తనిఖీ చేసి ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ను ఐక్యూ ఎయిర్ రూపొందిం చింది. ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా


ఇప్పుడా స్థానం లోకి ముంబై వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈసారి కలుషిత నగరాల టాప్ 10 లిస్టులో ఢిల్లీ పేరు లేదు. ఈ జాబితాలో ప్రపంచం లోనే అత్యంత పొల్యూటెడ్ సిటీగా పాకిస్తాన్లోని లాహోర్ నిలిచింది. ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా కాబూల్ (అఫ్ఘానిస్తా న్), కావో హిసియుంగ్ (తైవాన్), బిష్కెక్ (కిర్గిజ్ స్తాన్), ఆక్రా (ఘనా), క్రాకో (పోలండ్), దోహా (ఖతర్), అస్తనా (కజకిస్తాన్), శాంటియాగో (చిలీ) ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ సర్వే చేయడంలో 'ఐక్యూ ఎయిర్'కు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెం ట్ ప్రోగ్రామ్ (యూఎన్ఎస్ఈపీ), గ్రీన్ పీస్ సంస్థలు సహకరించాయి. ఈ స్టడీ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి కాలుష్యం, గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. లీటర్ పాలు రూ.210, కిలో చికెన్‌ రూ.780


దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న దేశంలోని ప్రధాన పట్టణాలలో మాత్రం కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి , ప్రపంచంలోనే అత్యధిక కలుషిత నగరాల జాబితాలో భారతదేశ పట్టణాలు ఉండడం రాజకీయ నాయకుని పనితనానికి నిదర్శనం .

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. లీటర్ పాలు రూ.210, కిలో చికెన్‌ రూ.780

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine