News

వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు.. ఏడు వరుసల సాగుతో అధిక ఆదాయం!

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో రోజురోజుకు నూతన పద్ధతులు
అందుబాటులోకి వస్తున్నాయి.దేశంలో ఎక్కువగా ఉన్న చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని తమకున్న కొంత పొలం లోనే పండ్ల, కూరగాయలు, ఆకు కూరలు, పువ్వులు వంటి అన్ని రకాల పంటలను సాగుచేస్తూ సంవత్సరం పొడవునా ఆదాయం పొందడానికి వీలుగా సాక్రో అనే స్వచ్ఛంద సంస్థ ఏడు వరుసల సాగు పద్ధతిని అనే కొత్త ఆవిష్కరణ చేసింది. ఇప్పటికే సాక్రో సంస్థ ఏడు వరుసల సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ మంచి ఫలితాలను రాబట్టింది.

నూతనంగా ఆవిష్కరించిన ఏడు వరసల సాగు
విధానాన్ని సాక్రో స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ సునీతప్రసాద్‌ వివరించారు. మొదటి వరుసలో కరివేపాకు వంటి ఎత్తున్న చెట్లు, రెండో వరుసలో సాధారణ ఎత్తు పెరిగే రకాలు, మూడో వరుసలో క్రీపర్‌ రకాలు, తర్వాత వరుసగా పూల మొక్కలు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంప రకాలు సాగు చేస్తున్నట్టు వెల్లడించారు.30 రోజుల్లో మొదటి పంట వస్తుందని తెలిపారు. తాము ప్రతిరోజు 60 కుటుంబాలకు అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

సాక్రో స్వచ్ఛంద సంస్థ నానక్‌రాంగూడ చౌరస్తాలో హెచ్‌ఎండీఏ స్థలంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి ఎకరా స్థలంలో దీర్ఘకాలిక స్వల్పకాలిక రకాలను సాగుచేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. అలాగే
గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు ఏడు వరుసల సాగు విధానంలో తమకున్న కొంత భూమిలో ఒక్క అంగుళం కూడా వృధా వివిధ రకాల పంటలను సాగు చేసుకోవడానికి ఈ విధానం చక్కగా సరిపోతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉద్యాన శాఖ అధికారులు ఈ విధానాన్ని పరిశీలించి ఈ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించడంలో కృషి చేస్తామని వెల్లడించారు.

Share your comments

Subscribe Magazine