News

కోట్లలో ధర పలికే అక్రమ రవాణా ..

Srikanth B
Srikanth B

అంతరించిపోయే దశలో ఉన్న ఓ పామును అమ్మేందుకు ప్రయత్నిస్తూ నలుగురు స్మగ్లర్లు అటవీశాఖ అధికారులకు చిక్కారు. బెంగాల్‌లోని సిలిగుడిలో ఈ ఘటన జరిగింది.

నిందితుల నుంచి 'రెడ్‌శాండ్‌ బోవా' అనే అరుదైన జాతికి చెందిన సర్పాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌మార్కెట్‌లో దీని ధర రూ.కోటి వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పామును బిహార్‌ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. బైకాంతపుర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లోని ఓ ఇంట్లో దీన్ని ఉంచినట్లు సమాచారం అందగానే.. బేలాకోబా రేంజ్‌ అధికారి సంజయ్‌దత్తా నేతృత్వంలోని బృందం స్మగ్లర్లపై దాడి చేసింది. నాలుగున్నర అడుగులు ఉన్న పామును స్వాధీనం చేసుకుంది.

'రెడ్‌శాండ్‌ బోవా గురించి :

చిత్తడి నేలల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అయితే ఈ పాములో విషం ఉండదని రెండు వైపుల తల ఉండటం కారణంగా వేగంగా కదల్లేదని తెలిపారు. పట్టుకున్న పాముకు రెండు తలలు ఉండవని ఎలుక బొరియల్లో దూరినప్పుడు చురుగ్గా కదలలేకపోవడం వలన ఎలుకలు కొరికేసి రెండవ వైపు తలను పోలిన ఆకారం ఏర్పడుతుందన్నారు.

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..


అయితే ఈ పామునే రెండు తలల పాముగా క్షుద్రపూజలకు వినియోగిస్తారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ చేసే వన్యప్రాణుల్లో ఈ పాము ఒకటన్నారు. రెండ్‌ సాండ్‌ బోయా లక్షల రూపాయలకు అమ్ముకుంటారని చెబుతున్నారు. ఈ రకం పాముల్ని రక్షించేందుకు ప్రభుత్వం వణ్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్‌-4లో దీనిని చేర్చిందని వివరించారు. అయితే క్షుద్రపూజలకు మినహాయిస్తే వీటికి ఎటువంటి విలువ లేదని తెలిపారు .

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine