News

జాంబీ వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు !

Srikanth B
Srikanth B

వైరస్ అంటేనే వణికే పరిస్థితిని కల్గించింది కరోనా వైరస్ . ప్రపంచం మొత్తాన్ని స్తంబింపచేసి ప్రజలను మృతువు అంచులవరకు తీసుకెళ్ళినంత పని చేసింది కరోనా వైరస్ . ఇపుడిపుడే నియంత్రణలోకి వచ్చి సాధారణ జీవితాన్ని ప్రారంభించిన ప్రజలకు ప్రపంచవ్యాప్తముగా కొత్త కొత్త వైరస్ ల పుట్టుక మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి . కరోనా కథ ముగియకముందే మంకీపాక్స్ అని "మార్బర్గ్ " వైరస్ అని కొత్త పేర్లతో వైరస్ లు పుట్టుకొస్తున్నాయి .

మానవాళి ఏదో ఓ విపత్తుని ఎదుర్కొంటూనే ఉంది. అయితే...మానవాళికి ప్రమాదం కలిగించే 24 వైరస్‌లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ఒకటి "జాంబీ వైరస్" (Zombie Virus).48,500 ఏళ్ల క్రితం నాటి ఈ వైరస్‌ను రష్యాలోని ఓ గడ్డకట్టిన సరస్సు కింద కనుగొన్నారు. సిబేరియాలో ఐరోపా శాస్త్రవేత్తలు ఈ వైరస్ శాంపిల్స్‌ని సేకరించారు. పరీక్షించిన తరవాత దీనికి "జాంబీ వైరస్" అనే పేరు పెట్టారు. ఇన్నేళ్ల పాటు మంచులో కూరుకుపోయినప్పటికీ...ఈ వైరస్‌కు వ్యాప్తి చెందే గుణం ఇప్పటికీ ఉందని వెల్లడించారు.

పాత 500, 1000 నోట్లు మార్చుకొని వారికోసం పరిష్కార మార్గాన్ని చుడండి - సుప్రీం కోర్టు

వాతావరణ మార్పుల కారణముగా పుట్టుకొచ్చే కొత్త కొత్త వైరస్ లతో మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ప్రపంచ ప్రఖ్యాత Bloomberg రిపోర్ట్ ఇదే విషయాన్ని తెలిపింది . మంచు కరిగి పోయే కొద్దీ కొత్త వైరస్ లు పుట్టుకొస్తాయని కూడా ఈ శాస్త్ర వేత్తల బృందం తెలిపింది . 2013లో ఇ శాస్త్రవేత్తల బృందం 30 వేల ఏళ్ల నాటి వైరస్‌ను కనుగొన్నారు. ఇప్పుడా రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ...అంత కన్నా పాత "వైరస్‌"ను గుర్తించారు.

పాత 500, 1000 నోట్లు మార్చుకొని వారికోసం పరిష్కార మార్గాన్ని చుడండి - సుప్రీం కోర్టు

Share your comments

Subscribe Magazine