News

ఆధార్ లో చిరునామా మార్చుకోవడం ఇప్పుడు సులువు ...

Srikanth B
Srikanth B
Address change in Aadhaar
Address change in Aadhaar

చిన్న దరఖాస్తు నుంచి పెద్ద పథకాల వరకు ఏదైనా పొందాలంటే ఆధార్ కార్డు ఎంత కీలకమో ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు బ్యాంకు అకౌంట్ నుంచి మొదలుకొని పాన్ కార్డు ,రేషన్ కార్డు అన్నింటిని ప్రభుత్వం లింక్ చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది , అయితే ఏదైనా విషయంలో చిన్న చిన్న పొరపాట్లు ఆధార్ కార్డులో ఉంటె వాటిని మార్చుకునే ప్రక్రియ పౌరులకు ఎంతో తలనొప్పి గ ఉండేది అందులో మరి ముఖ్యం గ చిరునామా మార్చే ప్రక్రియ అయితే దీన్ని సులభతరం చేస్తూ ఆధార్ (UIDAI ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది .

పౌరులు ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు చేసుకొనేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తాజాగా వెసులుబాటు కల్పించింది. ఆధార్‌లో భార్య, పిల్లల చిరునామా లాంటివి మార్చాలంటే ఇప్పటి వరకు వారి పేరుపై ఉండే గుర్తింపు కార్డును ప్రూఫ్‌గా చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు దీనికి భిన్నంగా కుటుంబ పెద్ద సెల్ఫ్‌డిక్లరేషన్‌ పత్రంతో పిల్లలు, జీవితభాగస్వామి చిరునామాను మార్చుకొనే కొత్త విధానాన్ని ఆధార్ సంస్థ ప్రకటించింది.ఈ మేరకు సంస్థ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. చిరునామా మార్పు కోసం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలకు అదనంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు (UIDAI) ప్రకటించింది . 18 ఏళ్లు నిండిన ఎవరైనా చిరునామా మార్పు కోసం కుటుంబ పెద్దగా వ్యవహరించే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది .

ఆన్‌లైన్‌ లో రైల్వే ప్లాట్‌ఫామ్ ,జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోండి ఇలా ..

అంతే కాకుండా వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ సేవలను తీసుకువచ్చింది . పౌరులకు ఆధార్ సంబందించిన ఈదిన సమస్యలు ఉంటె 1947 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చని సంస్థ పేర్కొంది .

ఆన్‌లైన్‌ లో రైల్వే ప్లాట్‌ఫామ్ ,జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోండి ఇలా ..

Share your comments

Subscribe Magazine