News

రైతులకు శుభవార్త.... ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో మీ పంటలు సేఫ్....

KJ Staff
KJ Staff

రబీ పంట చివరి దశకు చేరుకుంది, మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ పంట కాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రైవేట్ వాతావరం సూచనా కేంద్రం, స్కైమెట్ రైతులకు శుభవార్త తెలియచేసింది. వచ్చే వర్ష కాలంలో సాధారణ వర్షపాతం నమోదుకానున్నట్లు అంచనా వేసింది. దీని ద్వారా వర్షాధార రైతులకు ఎంతో మేలు జరగనుంది.

భారత దేశంలో ఇప్పటికి ఎంతో మంది రైతులు, వర్షాల మీద ఆధారపడి తమ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. చెరువుల ద్వారా, మరియు భూగర్భ జలాల నుండి నీటి లభ్యత లేని ప్రాంతాల్లోని రైతులు వర్షపు నీటిపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వర్షపాతం సాధారణంకంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్న ఇటువంటి ప్రాంతాల్లోని రైతులు భారీగా నష్టపోయే అవకాశం. స్కైమెట్ సంస్థ ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్ష శాతం ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు, వాయవ్య, పడమర రాష్ట్రాలు, మరియు మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలోసాధారణ వర్షపాతం నమోదుకానున్నట్లు తెలియజేసారు.

స్కైమెట్ సంస్థ, 2023 ఏప్రిల్లో సాధారణం కంటే తక్కువ 94% వర్షపాతం ఉంటుంది అంచనావేశారు. వీరు ఊహించిన విధంగానే ఆ ఏడాది, 94.4 వర్షపాతం నమోదయ్యింది. అయితే ఈ ఏడాది జులై మాసంలో 98 శాతం మరియు ఆగష్టు కి 110 శాతం వర్షపాతం ఉండచ్చని అంచనా. 96-104 శాతం వరకు ఉన్న వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా, 90-95 వరకు నమోదయ్యే శాతాన్ని సాధారణం కంటే తక్కువ వర్షపాతంగా పరిగణిస్తారు.

వర్షపాతం సాధారణంగా ఉండేందుకు అవకాశం ఉన్నందు వల్ల, నీటి ఎత్తడి అధికంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రైతులు, జూన్ నుండి తమ వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు అని సూచిస్తున్నారు. అయితే ఎప్పటిలాగానే కొన్ని ప్రాంతాల్లో భూగోళిక పరిస్థితులను బట్టి వర్షపాతం ఎక్కువ లేదా తక్కువ ఉండే ప్రమాదం లేకపోలేదని స్కైమెట్ సంస్థ హెచ్చరిస్తుంది. రైతులు తమ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయవల్సిన అవసరం ఉంది.

ఎల్ నినో ప్రభావం:

జూన్ నెల ప్రారంభం కాగానే, ఎల్ నినో ప్రభావం వల్ల కేరళ, కర్ణాటక, గోవా మరియు కొన్ని దక్షిణాది ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని స్కైమెట్ సంస్థ పేర్కొంది. జులై నాటికి, వర్షాలు ఎక్కువై, తడి వాతావరణం ఏర్పడబోతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటె భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, వర్షాకాలానికి సంబంధించిన తమ నివేదికను ఏప్రిల్ 15 న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ అంచనా ద్వారా భారత ప్రభుత్వం, రానున్న ఖరీఫ్ సీసన్ యొక్క పంట ఉత్పత్తిని అంచనా వేస్తారు.

Share your comments

Subscribe Magazine