News

మామిడి ఉత్పత్తిలో ఈసారి కూడా ఇండియాదే పై చెయ్యి

KJ Staff
KJ Staff

ప్రపంచ మామిడి ఉత్పత్తిలో ఈ సరి కూడా భారత దేశం అగ్రస్థానం సంపాదించుకోనుంది. ఈ సంవత్సరం మామిడి ఉత్పత్తి 14 శాతం పెరగనుందని, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్, డైరెక్టర్ టీ. దామోదరన్ వెల్లడించారు. ఈ సంవత్సరం మొత్తం 24 మిలియన్ టన్నుల మామిడి దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇండియ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏప్రిల్ మరియు నెలలో అధిక ఉష్ణోగ్రతతో వడగాలులు విస్తాయని హెచ్చరించారు, అయినప్పటికీ , వడగాలుల ప్రభావం మామిడి ఉత్పత్తిపై పడే అవకాశం తక్కువేనని దామోదరన్ వెల్లడించారు.

ఏప్రిల్ మరియు మే నెలల్లో సాధారణంకంటే ఎక్కువు ఉష్ణోగ్రతతో, దక్షిణ మరియు మధ్య భారత దేశంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. ఈ వేడి గాలులు మొత్తం 20 రోజుల వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ సమయంలో మామిడి రైతులు జాగ్రత్త వహించి, మట్టిలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులు అందించినట్లైతే, పిండే రాలడాన్ని తగ్గించి పంటను కాపాడుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మామిడిలో పూత దశ మరియు పిండే దశ ఎంతో కీలకం, ఐతే ఇప్పటికే భారత దేశంలోని దాదాపు అన్ని ,మామిడి పంటలు పూత దశ పూర్తయి పిండే దశకు చేరుకున్నాయని, దామోదర్ వెల్లండించారు. ఇప్పటివరకు వాతావరణం అనుకూలంగా ఉన్నందున, పూత దశ పూర్తయి పిండే దశకు చేరుకున్నట్లు తెలిపారు. 2022-2023 సమయంలో వాతావరణం అనుకూలించక మామిడి ఉత్పత్తి 21 మిలియన్ టన్నులకు పరిమితమైంది, కానీ ఈ ఏడాది సానుకూల వాతావరణం ఉన్నందున మామిడి దిగుబడి 14 శాతం పెరిగి 24 మిలియన్ టన్నుల ఉత్పత్తి రావచ్చని అయన తెలిపారు. మట్టిలోని తేమను బట్టి నీటి తడులు ఇవ్వడంలో మాత్రం ఆలస్యం చేయ్వాదని దామోదరన్ రైతులను హెచ్చరించారు.

పోయిన సంవత్సరం దక్షిణ భారత దేశంలో వాతావరణం అనుకూలించక, మామిడి దిగుబడి 15% తగ్గింది,ఈ ఏడాది ఆ పరిస్థితి రాకపోవచ్చని, అలాగే భారత దేశం మొత్తం మామిడి దిగుబడిలో 50% దక్షిణాది రాష్ట్రాల నుండి రానున్నట్టు తెలిపారు. దక్షిణ భారత దేశంలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మామిడి అధికంగా సాగుచేస్తారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మామిడి సాగులో ఇండియా వాటా 42% శాతంగా ఉంది. ఇక్కడ పండిన మామిడి ప్రపంచమంతా ఎగుమతి అవుతాయి.

Share your comments

Subscribe Magazine