News

త్వరలో వందే భారత్ రైలులో స్లీపర్ క్లాస్ !

Srikanth B
Srikanth B

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు వందే భారత్ ఎక్సప్రెస్ రైలు .. గంటకు 160 కిలో మీటర్ల వేగం తో ప్రయాణించే ఈ రైలు 2019 ఫిబ్రవరి 15 న జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని .. ప్రస్తుతానికి 6 మార్గాలలో వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్‌, మైసూర్-చెన్నై, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ రూట్లల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

ప్రస్తుతానికి ఈ హై స్పీడ్ రైలు లో కేవలం AC కోచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి . అయితే త్వరలోనే దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం స్లీపర్ కోచ్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు భారత్ రైళ్లు 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల దూరం మధ్య అందుబాటులో ఉన్నాయి.

మరో అల్పపీడనం .. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

భారతీయ రైల్వే 2023 ఆగస్ట్ 15 నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ ప్రస్తుతం 6 రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతీయ రైల్వే మొత్తం 400 వందే భారత్ రైళ్లను నడుపుతుందని రైల్వే మంత్రి తెలిపారు.సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో, సికింద్రాబాద్-విజయవాడ రూట్‌లో, సికింద్రాబాద్-విజయవాడ-తిరుపతి రూట్‌లో వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుందని రకరకాల వార్తలొస్తున్నాయి. భారతీయ రైల్వే పలు రూట్లను పరిశీలిస్తోంది. అయితే ఏ రూట్‌లో తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ రైలు వస్తుందన్న సస్పెన్స్ నెలకొంది.

మరో అల్పపీడనం .. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Share your comments

Subscribe Magazine