News

రైతులకు శుభవార్త: తెలంగాణ లో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం, రూ. 1,962 మద్దతు ధర!

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల రైతుల వద్దనుండి యాసంగి మొక్క జొన్న పంట కొనుగోళ్లు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సారి కనీస మద్దతు ధర క్విన్టకు రూ. 1,962 ఇస్తున్నట్టుగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రలో మొక్క జొన్న పండించే రైతులకు గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ని పొడిగిస్తూ ఈ సంవత్సరం కూడా యాసంగి లో పండిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. కనీస మద్దతు ధర పోయిన ఏడాది 2021- 22 లో రూ. 1870/- ఉండగా 2022-23 కి 92 రూపాయలు పెంచి 1,962/- క్వింటాల్ కు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

ఈ మేరకు వీలైనంత త్వరగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని రాష్ట్ర ముఖ్య మంత్రి కే. చంద్రశేఖర్ రావు, అగ్రికల్చర్ మినిస్టర్ అయిన ఎస్. నిరంజన్ రెడ్డిని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..

Mango: కృత్రిమంగా పండించిన మామిడి పళ్ళను మార్కెట్లో గుర్తించడం ఎలా ?

రాష్ట్రములో ఈ ఏడాది మొత్తం 6.5 లక్షల ఎకరాల్లో పండించడం జరిగింది. మిగతా జిల్లాలలో పోలిస్తే తెలంగాణ లోని వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాదు, ఖమ్మం జిల్లాలో అధిక రెట్ల లో మొక్క జొన్న పండించినట్లు తెలుస్తుంది. ఈ సారి 17.37 లక్షల టన్ను పంట ఉత్పత్తి ఉండవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట సేకరణ చర్యలు ప్రారంభించాలని ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..

Mango: కృత్రిమంగా పండించిన మామిడి పళ్ళను మార్కెట్లో గుర్తించడం ఎలా ?

image credit: mcCormik

Share your comments

Subscribe Magazine