News

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం

KJ Staff
KJ Staff

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వాహనాల కొరకు కీలక పాత్త్ర పోషిస్తుంది. తెలంగాణ విద్యుత్ వాహనాల తయారీ మరియు పరిశోధనలకు ప్రోత్సహం ఇస్తుంది. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రము ఈ- వెహికల్స్ తయారీ, పరిశోధనలు, వినియోగంలో దేశంలోనే తెలంగాణ కీలక భూమిక పోషించనుంది ఆయన తెలిపారు. ఆయన మాదాపూర్ హైటెక్స్లో 'ఈవి ఎక్స్పో 'ను ప్రారంభించారు. హైదరాబాద్ అత్యాధునిక సాంకేతికలను వదాటంలోనూ మరియు అభివృధిలోను ముందు ఉంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌలిక సదుపాయాలను కూడా అవసరమైతే అందించి, ఈవీలను ప్రోత్సహిస్తాను అని అన్నారు.

కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, పరిశోధనా, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సెల్ కంపోనెంట్ తయారీ, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, టువీలర్స్, 3 వీలర్స్, బ్యాటరీ మార్పిడి స్టేషన్లు, ఈవీ బస్సుల తయారీ దిశగా అడుగులు వేస్తుందన్నారు. విద్యుత్ వాహనాల తయారీ, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ ఈవీ -మోటార్ షో మొదటి ఎడిషన్ న్ను ప్రారంభించడం గర్వంగా ఉందన్న కేటీఆర్.. ఇది దేశంలోనే ప్రత్యేకమైన ఈవీ మోటార్ షోలలో ఒకటి అని అన్నారు. ఆపోలో, మహీంద్రా, అమరరాజా, టీవీఎస్, ఈటీవో మోటార్స్, ఓలా, ఎంజీ మోటర్స్తో పాటు ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు ఈ షోలో భాగస్వా మ్యంకావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత డిసెంబరులో అమరరాజా తన అత్యాధునిక గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుందని, ఇది రాష్ట్రంలో సమగ్ర ఈవీ, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ ఎకోసిస్టమ్ అభి వృద్ధికి మార్గంగా మారిందన్నారు. ఈవీ ఎక్స్పోలో సిట్రాన్ ఎలక్ట్రిక్ కారు, క్వాంటమ్ ఈవీ బైక్లను మంత్రి ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి..

భారతదేశంలో 'కాయిన్ వెండింగ్ మెషీన్ల'ను ప్రవేశపెట్టనున్న RBI...

ఇటీవల ప్రభుత్యవం ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం లక్షలు పెట్టి కొన్న కార్ అయినా కూడా కాలం తీరితే ఆ వాహనాన్ని తక్కువలో అమ్మాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారానిగా హాక్ ఐ సంస్థ కార్ యొక్క బాడీ ఫిట్ గా ఉంటె వాటిని ఈవీలాగా మార్చవచ్చు అని ఆ సంత డైరెక్టర్ శిరీష్ చెప్పారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ అటవీశాఖ, రక్షణ శాఖ లకు చెందిన వాహనాలు సహా 350 వాహనాలను రెట్రోఫిట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఓ కారు రెట్రో ఫిట్ చేయాలంటే రూ.5-7లక్షల వరకు ఖర్చవుతుందని అన్నారు.

నియో మోషన్ స్టార్టప్ దివ్యంగుల కోసం కొత్త రకమైన వీల్ చైర్ ను తయారుచేసింది. ఈ వీల్ చైర్కు డిజిటల్ డాష్బోర్డ్, మిర్రర్, హారన్, సైడ్ ఇండికేటర్స్ కుదాస్ ఉండటం విశేషం. ఈ వీల్ చైర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంట. పైగా ఈ వీల్ చైర్ అనేది డిటచబుల్ కూడా. ఈ వీల్ చైర్ యొక్క ధర వచ్చేసి రూ.99,999. ఈ స్టారప్ కంపెనీ ఫౌండర్ చెన్నైకి చెందిన సిద్దార్ధ్ దాగా. ఇప్పటికే ఈ స్టార్తప్ కంపెనీ 4 వేల వాహనాలను విక్రయించించి.

ఇది కూడా చదవండి..

భారతదేశంలో 'కాయిన్ వెండింగ్ మెషీన్ల'ను ప్రవేశపెట్టనున్న RBI...

Related Topics

electric vehicles

Share your comments

Subscribe Magazine