News

హైదరాబాద్‌లో తొలి గోల్డ్ ATM .. ఎన్ని గ్రాముల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు ?

Srikanth B
Srikanth B

ATM నుంచి డబ్బులు తీసినంత సులువుగా ఇప్పుడు బంగారం విత్ డ్రా చేసుకోవచ్చు . దేశంలోనే మొదటి సరిగా ఈ సేవలను హైదరాబాద్ నగరంలోని గోల్డ్ ఎటిఎం (Gold ATM ) ఏటీఎం మెషీన్‌ను బేగంపేటలో గోల్డ్ సిక్కా అనే సంస్థ ప్రారంభించింది .

ఈ గోల్డ్ ఎటిఎం (Gold ATM ) ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ.. ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99శాతం నాణ్యత కలిగిన 0.5, 1,2,5,10,20,50,100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు.

విత్ డ్రా చేసుకోవడానికిడెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చని భారత్ లో గోల్డ్ మార్కెట్ వేళలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9:50 నుంచి రాత్రి 11:30 ఈ ఏటీఎం ద్వారా గోల్డ్ కాయిన్స్ విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు .

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి... కాంగ్రెస్ పార్టీ డిమాండ్ !

ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ఈ గోల్డ్ ఏటీఎం త్వరలో ఎయిర్ పోర్ట్, ఓల్డ్ సిటీలో మరో మూడు, అబిడ్స్, సికింద్రాబాద్ తో పాటు వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్ లలో కూడా ప్రారంభించనున్నామని రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3 వేల గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు . మొదటి దశలో విజయవంతం అయితే దేశవ్యాప్తంగాఈ సేవలను తీసుకురానున్నది కంపెనీ .

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి... కాంగ్రెస్ పార్టీ డిమాండ్ !

Related Topics

Gold atm

Share your comments

Subscribe Magazine