News

శివ రాత్రికి ఉపవాసం ,జాగరణ చేసే వారు పాటించాల్సిన నియమావళి !

Srikanth B
Srikanth B

 


నేడు మహా శివరాత్రి హిందూ సంప్రదాయంలో ఈరోజుకు విశేష ప్రాధాన్యత వుంది , మహా శివరాత్రి రోజున ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు అంతే కాకుండా ఈ రోజున ఉపవాసం, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. అయితే కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఉపవాసం, జాగరణ చేస్తారు. ఆలా కాకుండా ఉపవాసం, జాగరణకు కొన్ని నియమాలు పాటించాలి అవేంటో ఇక్కడ చూద్దాం !

 

ఉపవాసం చేసేముందు పాటించాల్సిన నియమావళి :

ఈ రోజున పరమేశ్వరుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. శివపూజ ఉపవాసం, జాగారం.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డులాంటివి తినకూడదు. మద్యపానం చేయోద్దు. ఉపవాసం ఉండే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తల స్నానం చేసి.. శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.

ఆరోగ్యపరంగా చూసినా.. ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందట. నీళ్లు కూడా తాగకుండా.. ఉపవాసం చేయోద్దు. అలా చేయోద్దు. శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తీసుకెళ్లడం కష్టం. శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే.. వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి.

RBI కు సలహా ఇస్తే .. రూ. 40 లక్షల ప్రైజ్‌మనీ గెలిచే అవకాశం !

జాగరణకు పాటించవసిన నియమావళి :


శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న దేవునిపై భక్తిని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెబుతూ.. కాలక్షేపం చేస్తూ.. జాగరణ చేయకూడదు. అది జాగరణ అవ్వదు.. టైమ్ పాస్ మాత్రమే అవుతుంది. మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి.. ప్రశాంతంగా ఉండాలి. శివరాత్రి మరుసటి రోజు.. ఉదయం శివాలయాన్ని సందర్శించి.., ప్రసాదాన్ని తీసుకుని.. ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం వ్రతం ముగించాలి.

RBI కు సలహా ఇస్తే .. రూ. 40 లక్షల ప్రైజ్‌మనీ గెలిచే అవకాశం !

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine