News

నూతన వ్యవసాయ చట్టం పై మరోసారి రైతులతో చర్చకు సిద్ధమంటున్న తోమర్.

KJ Staff
KJ Staff
Rakesh Tikait
Rakesh Tikait
నూతన వ్యవసాయ చట్టం 2020 పై ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతు రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని రైతులకు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవసాయ చట్టాన్ని అవలంభిస్తున్నారని ఒకవేళ మీకు ఏమైనా విభేదాలు ఉంటే మళ్ళీ చర్చకు సిద్ధమా అంటూ రైతు సంఘాలకు పిలుపునిస్తూ ఇప్పటికే 11 సార్లు రైతులతో చర్చించామని, ఎంఎస్‌పీని పెంచామని, పెంచిన ధరకే ఎక్కువ మొత్తంలో వ్యవసాయోత్పత్తులను సేకరిస్తున్నామని వివరించారు. 

త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రైతు సంఘాల నేత ప్రకటన:

ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది నవంబరు 26న ప్రారంభమైన మా రైతు ఉద్యమం శనివారంతో ఎనిమిదో నెలలో అడుగుపెట్టింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత "రాకేశ్ తికాయత్" శనివారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో అతి పెద్ద ఉద్యమం రాబోతోందని హెచ్చరిస్తూ "ట్రాక్టర్లు లేకపోతే ఢిల్లీకి ఏదీ లేదు" అనే విషయం కేంద్రానికి అర్థం కావడం లేదన్నారు. తదుపరి నిరసన తేదీ, ప్రదేశం వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద ఎత్తున రైతన్నలు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు వినతిపత్రాలు సమర్పించేందుకు చండీఘర్ తరలి వచ్చారు అని ఆయన ప్రకటించారు.
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని, తమ పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని కొనసాగించాలని కోరుతున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం 11సార్లు చర్చలు జరిపింది. జనవరి 22న చివరిసారి చర్చించింది. కానీ ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. జనవరి 26న రైతు సంఘాల శాంతియుతంగా మొదలెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ప్రలిష్టంభన ఏర్పడిన విషయం మనకు తెలిసిందే.

Related Topics

Narendra Singh Tomar Farmer

Share your comments

Subscribe Magazine