News

TSRTC :పండుగకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు -ఎండీ వీసీ సజ్జనార్‌

Srikanth B
Srikanth B
TSRTC
TSRTC

సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ని సందర్శించి ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు అని డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు .

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,233 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు సజ్జనార్‌ తెలిపారు. ఇందులో 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరుకు 83 బస్సులు, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20 బస్సులు నడుపుతున్నట్లు ఎండీ వెల్లడించారు.

యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...

ఈ నెల 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులు . విజయవాడ 54, విశాఖపట్నం 19, అమలాపురం 23, శ్రీకాకుళం 9, ఏలూరు 11, రాజమండ్రి 12, గుంటూరు 29, బాపట్ల 5, చీరాల 7, మచిలీపట్నం 5, గుడివాడ 6, తెనాలి 4, రాజోలు 9 ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలిపారు.

డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని మరియు గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ బుకింగ్ కోసం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
సంక్రాంతి సందర్భంగా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కార్పొరేషన్ 10 శాతం రాయితీ ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

ప్రజలు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందాలని మరియు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in ని సందర్శించాలని వారు సూచించారు .

యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...

Related Topics

TSRTC

Share your comments

Subscribe Magazine