News

చంద్రబాబు అరెస్ట్ :ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసు ఏమిటి?

Srikanth B
Srikanth B
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసు ఏమిటి?

నాటకీయ పరిణామం మద్య ఏపీ సీఐడీ పోలీసులు అదికారులు సెప్టెంబర్ 9న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉదయం ఐదు గంటలకు అరెస్ట్ చేసారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించి క్రిమినల్ కేసులో  శుక్రవారం అర్ధరాత్రి నుంచి కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల నుంచి పలు బస్సుల్లో పోలీసులు భారీగా పోలీసు బలగాలను మోహరించి ఉదయం 5.00 గంటలకు (శనివారం) నంద్యాలలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఉన్న చంద్రబాబు నాయుడును CID అధికారులు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసారు.


ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటైంది. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా నిరుద్యోగ యువత సాధికారిత అందించాడం దీని లక్ష్యం .

అసలు ఆరోపణలు ఏమిటి ?

మంత్రి వర్గ ఆమోదం లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  ప్రాజెక్టును ప్రారంభించడం .

ప్రాజెక్ట్ కోసం సీమెన్స్ గ్లోబల్ కంపెనీ కేటాయించబడిన నిధులు షెల్ కంపెనీలకు మళ్లించడం.

టెండర్ దక్కించుకున్న కంపెనీ స్కిల్ డేవలంప్ మ్మ్ంట్ కోసం నిధులను ఖర్చుచేయకపోవడం.

సీమెన్స్ గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ ఈ ప్రాజెక్ట్‌పై అంతర్గత దర్యాప్తులో ప్రాజెక్ట్ మేనేజర్ హవాలా లావాదేవీల ద్వారా ప్రభుత్వం కేటాయించిన సొమ్మును షెల్ వ్యాపారాలకు మళ్లించాడని తేలింది.

ఈ ఆరోపణలపై టెండర్లను ప్రకటించడంలో అవకతవకలు జరిగి 3,300 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలపై CID దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే పై ఆరోపణలపై ఉదయం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసారు.

ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ. 5 లక్షలకు పెంపు .. eKYC చేసుకున్న వారికే

 

ఏయే సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసారు?

ఐపిసిలోని సెక్షన్ 120 (బి) 166, 167, 41బి, 420, 465, 468, 471, 409 201, 109 ఆర్/డబ్ల్యు 34 మరియు 37 కింద క్రైమ్ నెం. 29/2021కి సంబంధించి అరెస్టు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. ; మరియు మంగళగిరిలోని CID పోలీసుల నుండి 1968 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, 13 (2) r/w 13 (1) (c) మరియు (d) క్రింద కేసు నమోదు చేసారు.

ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ. 5 లక్షలకు పెంపు .. eKYC చేసుకున్న వారికే

Related Topics

chandrababu

Share your comments

Subscribe Magazine